Site icon NTV Telugu

Bootcut Balaraju Teaser: బిగ్‌‌బాస్ ఫేమ్ సోహెల్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Sohel

Sohel

Bootcut Balaraju Teaser: ‘బిగ్‌‌బాస్’ ఫేమ్ సోహెల్ షో నుంచి బయటికి వచ్చాక హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. అవేమి ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయాయి. అయినా కూడా సోహెల్ తన ప్రయత్నాలను ఆపలేదు. తాజాగా సోహెల్ హీరోగా తెరకెక్కిన చిత్రం బూట్‌ కట్ బాలరాజు. శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్ పై ఎం.డీ పాషా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో సోహెల్ సరసన మేఘ లేఖ నటిస్తుండగా.. సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘బూట్‌ కట్ బాలరాజు’ టీజర్ ని లాంచ్ చేశారు.

‘అనగనగా ఒక రాజు అనేది పాత కథ ఐతే… అనగనగా ఒక బూట్‌ కట్ బాలరాజుఅనేది కొత్త కథ” అనే వాయిస్ తో మొదలైన టీజర్ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ గా వుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లవ్, ఎంటర్ టైమెంట్ అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. బూట్‌ కట్ బాలరాజు పాత్రలో సోహెల్ హైలీ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. సునీల్ తో పాటు ముక్కు అవినాష్, సద్దాం పాత్రలు వినోదాన్ని పంచాయి. మేఘ లేఖ, ఇంద్రజ పాత్రల ప్రజెన్స్ అలరించింది. నేపధ్య సంగీతం వినోదాన్ని రెట్టింపు చేసింది. శ్యామ్ కె నాయుడు కెమరావర్క్ కలర్ ఫుల్, లైవ్లీ గా వుంది. నిర్మాణ విలువలు టాప్ క్యాలిటీలో వున్నాయి. మొత్తానికి హిలేరియస్ టీజర్ ‘బూట్‌ కట్ బాలరాజు’ పై క్యురియాసిటీని మరింతగా పెంచింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version