Salman Khan: ఐఫా వేదిక సాక్షిగా టైగర్ 3 అప్డేట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు ఇండియాలో మోస్ట్ హైప్డ్ ఫ్రాంచైజ్ గా ‘యష్ రాజ్ స్పై యూనివర్స్’ నిలిచిందంటే దానికి ఏకైక కారణం ‘ఏక్ థా టైగర్’ సినిమా. సల్మాన్ ఖాన్ హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన ‘ఎక్ థా టైగర్’ సినిమాతో మొదలైన స్పై యాక్షన్ సినిమాల పరంపర బాలీవుడ్ లో బాగానే వర్కౌట్ అయ్యింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని పెట్టింది పేరైన ‘ఎక్ థా టైగర్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా ‘టైగర్’ అనే ఒక కొత్త ‘స్పై’ని ఇండియన్ ఆడియన్స్ కి పరిచయం చేసింది. ఈ సినిమాకి సీక్వెల్ గా ‘టైగర్ జిందా హై’ సినిమా రిలీజ్ అయ్యి మొదటి పార్ట్ కన్నా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. టైగర్, జోయాల ప్రేమ… టైగర్ ఇండియా కోసం చేసే యాక్షన్… ఈ రెండూ ఆడియన్స్ ని టైగర్ సీరీస్ కి బాగా దగ్గర చేసాయి. ఇక్కడి నుంచే యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఆలోచన మొదలయ్యింది.
టైగర్ ఫ్రాంచైజ్ నుంచి మూడో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ 2023 నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే అఫీషియల్ గా డేట్ లాక్ చేసిన మేకర్స్, షూటింగ్ కి శరవేగంగా జరుపుతున్నారు. ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ అబుదాబీలో జరుపుకుంది. ఐఫా 2023 వేదికపైన సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ… టైగర్ 3 షూటింగ్ కంప్లీట్ అయిపొయింది, ఆల్రెడీ అనౌన్స్ చేసిన డేట్ కి టైగర్ 3 థియేటర్స్ లోకి వస్తుందని క్లారిటీ ఇచ్చేసాడు. దీంతో సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్, టైగర్ 3 టాగ్స్ ని క్రియేట్ చేసి ఫాన్స్ హల్చల్ చేస్తున్నారు. టైగర్ 3 కోసం సల్మాన్ ఫాన్స్ మాత్రమే కాదు షారుఖ్ ఖాన్ ఫాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పఠాన్ సినిమాలో సల్మాన్ క్యామియో ప్లే చేసినట్లే, టైగర్ 3లో షారుఖ్ ఖాన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నాడు. ఈ మొత్తం సీక్వెన్స్ టైగర్ vs పఠాన్ సినిమాకి లీడ్ ఇచ్చేలా ఉంటుందట. ఇద్దరు సూపర్ స్టార్ లు ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుందో పఠాన్ సినిమా శాంపిల్ చూపించింది, ఇప్పుడు టైగర్ 3 దానికి పీక్ స్టేజ్ చూపించబోతుంది.
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
తాజావార్తలు
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!