NTV Telugu Site icon

Ranbir Kapoor: టాలీవుడ్‌లో మూవీ చేయబోతున్న బాలీవుడ్ స్టార్..!

February 7 (81)

February 7 (81)

ప్రజంట్ ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రేక్షకులు అన్ని భాషల్లోని సినిమాలు వీక్షిస్తున్నారు. అందుకే చిన్న సినిమాల రేంజ్ కూడా పెరిగింది. ఇది దృష్టిలో పెట్టుకుని దర్శకులు కథలు రాస్తున్నారు. కంటెంట్ కనుక బాగుంటే.. పక్క భాషల్లో కూడా తెలుగు సినిమాలు హిట్ అవుతున్నాయి.అందుకే కొన్నాళ్లుగా మన తెలుగు దర్శకులు కూడా పక్క భాషల్లోని హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా డైరెక్టర్ వెంకీ అట్లూరి ఆల్రెడీ ధనుష్ తో ‘సార్’, దుల్కర్ తో ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాలు తీసి హిట్టు కొట్టగా. వంశీ పైడిపల్లి.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ‘వారసుడు’ అనే సినిమా తీసి హిట్టు కొట్టాడు. ఇక ఇప్పుడు తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో కూడా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్. మరి ఇంతకి ఎవ్వరా హీరో అంటే.

Also Read: Ram Gopal Varma : స్లో మోషన్ లేకపోతే రజినీకాంత్ లేడు : రామ్ గోపాల్ వర్మ

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్. ‘బ్రహ్మాస్త్రం’, ‘యానిమల్’ వంటి చిత్రలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ‘యానిమల్’ మూవీలో తనలోని కొత్త యాంగిల్ చూపించాడు. దీంతో అన్ని చోట్ల అతని ఫ్యాన్ బేస్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే తాజాగా ఇప్పుడు తెలుగులో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడట రణబీర్ కపూర్. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ లో తన చిత్రం రూపొందే అవకాశాలు ఉన్నాయట. దర్శకుడు ఎవరు? జోనర్ ఏంటి? అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.