Site icon NTV Telugu

‘నీ ఫిగర్ సైజెంత’ అని అడిగిన నెటిజన్.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన స్టార్ హీరోయిన్

సోషల్ మీడియా వచ్చాకా ప్రతి ఒక్కరు తమ వాక్చాతుర్యానికి పని చెప్తున్నారు. మనల్ని ఎవడు ఆపలేడు అంటూ నోటికి ఏది వస్తే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. ఇది కొంత వరకు ఓకే కానీ హీరోయిన్లకు మాత్రం చాలా ఇబ్బందిగా మారింది. వారు అభిమానులతో ఇంట్రాక్ట్ అవడానికి ప్రయత్నించిన ప్రతిసారి కొందరు ఆకతాయిలు మాత్రం వారిని వల్గర్ క్వశన్స్ అడిగి వారిని ఇబ్బందిపెట్టడమే కాదు మిగతా నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు.

ఇక హీరోయిన్లను ఇలాంటి ప్రశ్నలతో వేధించడం అలవాటుగా మారిపోయింది. కొంతమంది లైట్ తీసుకుంటుండగా.. మరికొందరు చాలా స్ట్రాంగ్ కౌంటర్ లు ఇస్తారు. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ కూడా ఇలాంటి వల్గర్ ప్రశ్ననే ఎదుర్కొంది. ఇటీవల దిశా ఇన్ స్టాగ్రాం వేదికగా అభిమానులతో ముచ్చటిస్తుండగా ఒక ఆకతాయి.. ‘నీ ఫిగర్ సైజెంత.. దిశా’ అని అడిగేశాడు.

ఈ ప్రశ్నకు దిశా సీరియస్ అవ్వకుండా ఒక జిఫ్ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఒక పాండా ఫన్నీగా నవ్వుతూ తిరగడం కనిపించింది. దీన్ని బట్టి ఆ ప్రశ్నను అమ్మడు లైట్ గా తీసుకుందని అర్ధమవుతుంది. అయితే ఆమె అభిమానులు మాత్రం నెటిజన్ పై ఫైర్ అవుతున్నారు. ఆడవారిని ఇలాంటి ప్రశ్నలు ఎలా అడుగుతారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version