Site icon NTV Telugu

Sonu Nigam: ప్రముఖ బాలీవుడ్ సింగర్ పై ఎమ్మెల్యే కుమారుడు దాడి

Sonu Nigam

Sonu Nigam

సెల్ఫీ విషయంలో ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షా విషయంలో జరిగిన దాడిని మర్చిపోక ముందే, మరో సెల్ఫీ సంఘటన జరిగింది. సెల్ఫీ అడిగితే ఇవ్వలేదని బాలీవుడ్ సింగర్ న్’సోను నిగమ్’పై దాడి జరిగింది. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సోమవారం చెంబూరులోని సబర్బ్‌లో జరిగిన ఓ మ్యూజిక్ ఈవెంట్ ప్రదర్శన ఇవ్వడానికి సోనూ నిగమ్‌ వచ్చారు. స్టేజ్‌పైకి సోనూ నిగమ్ ఎక్కుతుండగా ‘ఉద్ధవ్ ఠాక్రే’ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ ఫర్తేపేకర్, సోను నిగమ్ తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఇదే సమయంలో జనరల్ ఆదియన్స్కు దసోను నిగమ్ తో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించడంతో, సోను నిగమ్ టీం అందరికీ అనుమతిని నిరాకరించారు. దీంతో ఈవెంట్ లో గొడవ జరిగింది.

Read Also: Shahrukh Khan: షారుఖ్ ను వదిలి పెట్టని బాయ్ కాట్ బ్యాచ్!

ఎమ్మెల్యే ప్రకాష్ కొడుకు, మెట్లపై నుంచి సోను నిగమ్ అండ్ టీమ్ ని కిందకి తోసేసాడు. ముందుగా సోను నిగమ్ పక్కనే ఉన్న అతని స్నేహితుడు రబ్బానీ ఖాన్ ని మెట్లు పై నుంచి కింద పడేశారు. రబ్బానిని నెట్టడంతోనే అలర్ట్ అయిన సోను నిగమ్ సెక్యురిటి ఇద్దరికీ కూడా గాయాలు అయ్యాయి. దాడి చేసే వారిని ఆపే ప్రయత్నం చేస్తుండగా సోను నిగమ్ ని కూడా కిందకి నేట్టేసారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, ముంబై పోలీసుల జాయింట్ సీపీ లా అండ్ ఆర్డర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎవరూ గాయపడినట్లు నివేదించబడలేదు. ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని తెలిపారు.

 

Exit mobile version