కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సార్ తో ధనుష్ కు, లక్కీ భాస్కర్ తో దుల్కర్ కు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన వెంకీ అట్లూరి ఇప్పుడు సూర్యతో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై సూర్య చాలా ధీమాగా ఉన్నాడు. సూర్య సరసన మలయాళ ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తోంది.
కాగా ఈసినిమా కోసం బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ను ఆన్ బోర్డు చేయబోతున్నారు. సినిమాలో కీలకమైన ఓ పాత్ర అనిల్ కపూర్ చేస్తేనే బాగుంటదని భావించిన మేకర్స్, ఇటీవల కపూర్ కు కథ వినిపించగా అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. త్వరలో ఇందుకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతుందట. సూర్య ఓ వైపు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుప్పు సినిమా చేస్తూ మరోవైపు వెంకీ అట్లూరి సినిమా చేస్తున్నాడు. రెట్రో తో భారీ డిజాస్టర్ కొట్టిన సూర్య ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను రూరల్ యాక్షన్ డ్రామాగా తీసుకురాబోతుండగా, వెంకీ అట్లూరి సినిమాను అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీసుకురాబోతున్నారు. సుర్య నుండి కంప్లైట్ ఫ్యామిలీ సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. వెంకీ అట్లూరి కూడా సూర్యకు కన్ఫామ్ హిట్ ఇస్తాను అని ధీమాగా ఉన్నారు. GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైనర్ బ్యానేర్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు.
