కరోనా కష్టాలు, నేపోటిజం నిందలు, బాయ్ కాట్ బాలీవుడ్ విమర్శలు, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం, సౌత్ సినిమాల దాడి… హిందీ చిత్ర పరిశ్రమని కోలుకోలేని దెబ్బ తీశాయి. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మార్కెట్ కంప్లీట్ గా దెబ్బ తిన్న సమయంలో… 2023 మళ్లీ ప్రాణం పోసింది. హిందీ చిత్ర పరిశ్రమకి 2023కి కొత్త కళ తెచ్చింది. షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టడం, గదర్ 2 550 కోట్లకి పైగా కలెక్ట్ చేయడం, టైగర్ 3 సినిమా మంచి కలెక్షన్స్ ని రాబడుతూ ఉండడం, యంగ్ హీరోల సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకోవడంతో బాలీవుడ్ పూర్తిగా కోలుకుంది. నార్త్ మార్కెట్ మొత్తం రివైవ్ చేసిన 2023 ఇయర్ మరింత గ్రాండ్ గా క్లోజ్ చేయడానికి బాలీవుడ్ రెడీ అయ్యింది.
డిసెంబర్ నెలలో మూడు పెద్ద సినిమాలు ఆడియన్స్ ముందుకి రానున్నాయి. ఇందులో డిసెంబర్ 1నే రెండు సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ‘సామ్ బహదూర్’ సినిమా బయోపిక్ గా తెరకెక్కింది. ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉంది. టాక్ బాగుంటే మేఘ్నా డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా 200-300 కోట్లు కలెక్ట్ చేస్తుందని బాలీవుడ్ ప్రిడిక్ట్ చేస్తుంది. మరోవైపు డిసెంబర్ 1నే అనిమల్ సినిమా కూడా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. సందీప్ రెడ్డి వంగ మేకింగ్, రణబీర్ ఇంటెన్స్ యాక్టింగ్ హైలైట్ గా అనిమల్ సినిమా ప్రమోషన్స్ జరుపుకుంది. ఈ మూవీ షూర్ షాట్ హిట్ అనే కామెంట్స్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. రణబీర్ గత సినిమాల కలెక్షన్స్, సందీప్ రెడ్డి ఫస్ట్ సినిమా కబీర్ సింగ్ కలెక్షన్స్ ని దృష్టిలో పెట్టుకోని చూస్తే అనిమల్… రణబీర్ కపూర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అయ్యేలా ఉంది. ఇక బాలీవుడ్ ని కష్టాల నుంచి బయట పడేసిన షారుఖ్ కూడా హ్యాట్రిక్ కొట్టడానికి రాజ్ కుమార్ హిరాణీతో కలిసి డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. ఈ మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ లో తెరకెక్కిన డంకీ సినిమా బాక్సాఫీస్ దగ్గర 1500 కోట్ల వరకూ కలెక్ట్ చేసే అవకాశం ఉంది.
ఓవరాల్ గా సామ్ బహదూర్, అనిమల్, డంకీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర 2000 కోట్ల వరకూ కలెక్ట్ చేసేలా ఉన్నాయి. ఇవి చాలవన్నట్లు డంకీ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డే డైనోసర్ సలార్ రిలీజ్ అవుతుంది. ప్రభాస్ కి నార్త్ లో ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బింగ్ సినిమాగా కాకుండా స్ట్రెయిట్ హిందీ సినిమాల రేంజులోనే సలార్ నార్త్ రిలీజ్ ఉంటుంది. ప్రభాస్ ఫ్లాప్ సినిమాలే నార్త్ లో 300-400 కోట్లు రాబడుతూ ఉంటాయి. అలాంటిది ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ సినిమా అంటే కలెక్షన్స్ ని అంచనా వేయడం కూడా కష్టమే. ఒకవేళ సలార్ హిందీ వెర్షన్ కేవలం నార్త్ లోనే 500 కోట్లు కలెక్ట్ చేస్తే… బాలీవుడ్ బాక్సాఫీస్ ఖాతాలో ఒక నెలలోనే మూడు వేల కోట్ల పడినట్లే అవుతుంది.