బాలీవుడ్ బ్యూటీ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికి ఇప్పటికి ఆమె ఎంతోమంది కుర్రకారుకు కలల రాణి. ‘దిల్ వాలే దుల్హేనియా లేజాయంగే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను సైతం తన అభిమానులుగా మార్చుకున్న ఈ బ్యూటీ ఇప్పటికి అదే గ్లామర్ ను మెయింటైన్ చేస్తుంది అనుకున్నారు అభిమానులు ఈ పిక్ చూడకముందు వరకు.. తాజాగా కాజోల్ కొద్దిగా బరువు పెరిగి కనిపించింది. ఇటీవల సినిమాలను తగ్గించిన ఈ భామ ఇంటికే పరిమితమయ్యింది. అప్పుడప్పుడు పలు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఇక తాజాగా కాజోల్ న్యూ లుక్ బాలీవుడ్ అభిమానులను షాక్ కు గురిచేస్తోంది. ఆమె కాస్తా బరువు పెరిగి, పొట్ట ముందుకు వచ్చి.. వయస్సు మీద పడినట్లు కనిపించింది. ఈ మధ్యకాలంలో జిమ్ వద్ద కూడా అమ్మడి సందడి లేదు. ఇక బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో కాజోల్ జిమ్ వద్ద కనిపించేసరికి ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలను టకటకా క్లిక్ మనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు బాబోయ్ .. కాజోల్ ఏంటి ఇలా తయారయ్యింది.. అని కొందరు.. ఇంత ముసలిదానిలా ఉందేంటి..? అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ ట్రోల్ల్స్ వలన కాజోల్ కష్టపడి మునుపటి రూపాన్ని పొందుతుందేమో చూడాలి.
