Site icon NTV Telugu

Deepika Padukone: 18 ఏళ్ల వయసులో బ్రెస్ట్ సైజ్ పెంచే సర్జరీ చేయించుకో అన్నాడు

deepika

deepika

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా కాకముందే మోడలింగ్ చేసిన విషయం తెల్సిందే. 18 ఏళ్ళ వయసులోనే ఆమె మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో ఆమె ఎన్నో అవమానాలను, ఎన్నో ఉచిత సలహాలు ఇచ్చేవారట. ఆ సమయంలో ఒక వ్యక్తి ఇచ్చిన సలహా తనను చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీపిక అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.

” కెరీర్‌ బిగినింగ్‌ ఉచిత సలహాలు ఇచ్చేవారు చాలామందే ఉంటారు. నాకు కూడా అలాంటి సలహాలిచ్చినవారు చాలామందే ఉన్నారు. మోడలింగ్ చేసే సమయంలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. మేడమ్.. మీరు బ్రెస్ట్‌ ఇంప్లాంట్స్‌ సర్జరీ చేయించుకోండి అని చెప్పాడు. ఒక్కసారి ఆ మాట విని నేను షాక్ అయ్యి అక్కడి నుంచి వచ్చేశాను. తరువాత దాన్ని సీరియస్ గా తీసుకోలేదు కానీ అలా అనేసరికి బాధపడ్డానని” చెప్పుకొచ్చింది. ఇక 21 ఏళ్ళ వయసులో దీపికా ఓం శాంతి ఓం చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో ఎదురుదెబ్బలు తిని స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకుంది.

Exit mobile version