NTV Telugu Site icon

LEO: విజయ్ Vs KGF విలన్… పాన్ ఇండియా సంభవం లోడింగ్

Leo

Leo

లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన లేటెస్ట్ మూవీ ‘లియో’. అనౌన్స్మెంట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతోంది. దాదాపు 90 రోజుల్లోనే ‘లియో’ షూటింగ్ ని కంప్లీట్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే శరవేగంగా షూటింగ్ చేస్తూ ఒక్కొక్కరి పార్ట్ ని పూర్తి చేస్తున్నారు. మాస్టర్ సినిమాతో బాలన్స్ ఉన్న హిట్ ని ఈసారి పాన్ ఇండియా లెవల్లో అందుకోవడానికి విజయ్, లోకేష్ కనగరాజ్ లు KGF విలన్ ని రంగం లోకి దించారు. KGF సినిమాతో సౌత్ ఆడియన్స్ కి దగ్గరైన బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ లియో సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక వీడియోని రిలీజ్ చేశారు. సంజయ్ దత్ ని ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి విజయ్ ని సంజయ్ దత్ కలిసే వరకూ ఈ వీడియోలో ఉంది.

Read Also: Dasara Trailer: ఇలాంటి నానిని ఇప్పటివరకూ చూసి ఉండరు…

ఊహించని ఈ అప్డేట్ బయటకి రావడంతో విజయ్ ఫాన్స్, సంజయ్ దత్ ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. $LEO ట్యాగ్ ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. మరి ఈ ఇద్దరి మధ్య ఉండబోయే ఫేస్ ఆఫ్ సీన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ సినిమాలో హీరో ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో, విలన్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటాడు. మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి క్యారెక్టర్, విక్రమ్ సినిమాలో సూర్య క్యారెక్టర్ లే ఇందుకు ఉదాహరణ. సంజయ్ దత్ క్యారెక్టర్ కూడా అదే రేంజులో ఉంటే లియో సినిమా బాలీవుడ్ లో కూడా బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడం గ్యారెంటీ.

Show comments