Shera: 1.4 కోట్లతో రేంజ్ రోవర్ కారు కొన్న సల్మాన్ ఖాన్ బాడీగార్డ్… జీతం ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shera Salary: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా 1.4 కోట్ల విలువైన లగ్జరీ రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. షేరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కారు ఫోటోను షేర్ చేశారు. 1995 నుండి, నటుడు సల్మాన్ ఖాన్ అంగరక్షకుడు, షేరా ఎల్లప్పుడూ సల్మాన్ ఖాన్‌తో ఉంటాడు. అంతర్జాతీయ పర్యటనలలో సైతం సల్మాన్ ఖాన్‌ను అంటి పెట్టుకునే ఉంటాడు. ఇటీవల, షేరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాను కొనుగోలు చేసిన ఈ బ్రాండ్ న్యూ రేంజ్ రోవర్ కారుతో పోజులివ్వగా, ఆ ఫోటో వైరల్‌గా మారింది. సల్మాన్ ఖాన్ నమ్మకమైన బాడీగార్డ్ గా 29 సంవత్సరాలుగా షేరా పని చేస్తున్నాడు. సర్వశక్తిమంతుడి ఆశీర్వాదంతో మేము కొత్త సభ్యుడిని మా ఇంటికి స్వాగతిస్తున్నాము, ”అని ఆయన రాసుకొచ్చారు. ఇక ఈ లగ్జరీ కారు అంచనా ధర రూ. 1.4 కోట్లు.
Shakeela: హోటల్‌లో తెలుగు హీరోయిన్‌పై లైంగిక వేధింపులు.. మధ్యలో షకీలా ఎంట్రీ!
Also Read
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
ఈ అంగరక్షకుడు షేరా అసలు పేరు గుర్మిత్ సింగ్ జాలీ, అతను 1995 నుండి సల్మాన్ ఖాన్ అంగరక్షకుడు. ఆయన టైగర్ సెక్యూరిటీ అనే సెక్యూరిటీ సంస్థను కలిగి ఉన్నాడు. 2017లో, గ్రామీ అవార్డు గెలుచుకున్న పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ముంబైకి వచ్చినప్పుడు, ఈ షేరా సంస్థ అతనికి భద్రత కల్పించింది. ఇక ముంబైలోని అంధేరిలో 19 మే 1969న జన్మించిన షేరా 1987లో ముంబై జూనియర్ బాడీ బిల్డింగ్ అవార్డును గెలుచుకుని 1988లో మహారాష్ట్ర జూనియర్ అవార్డును గెలుచుకుని సల్మాన్ ఖాన్ కి సన్నిహితుడుగా మారాడు. ఇక 2019లో షేరా శివసేనలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. చాలా ఇంటర్వ్యూలలో సల్మాన్‌తో తన సుదీర్ఘ అనుబంధం గురించి మాట్లాడుతూ, షేరా నాకు శ్వాస ఉన్నంత వరకు తన సోదరుడు సల్మాన్‌తో ఉంటానని చెప్పుకొచ్చాడు. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ జీతం గురించి చాలా మందికి ఆసక్తి ఉండవచ్చు. సల్మాన్‌ఖాన్‌తో ఉన్న చిరకాల స్నేహం కారణంగా షేరా జీతం ఇప్పుడు కొంతమంది కార్పొరేట్ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలను మించిపోయింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం, షేరా నెలకు రూ. 15 లక్షల జీతం, రూ. 2 కోట్లకు పైగా వార్షిక వేతనం పొందుతున్నారట.
- Tags
- Salman Khan
- shera
తాజావార్తలు
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!