అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా డెకాయిట్. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఈ సినిమా ఒకటి. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటి వామిక గబ్బి ముఖ్య పాత్రలో నటిస్తోంది. షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుండగా, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పించారు.
Also Read : SSMB 29 : వేటకు సిద్ధమైన మహేశ్.. ఫోటో లీక్
తాజాగా ఈ సినిమా నుండి ఇప్పుడు మరో ప్రధాన పాత్రను పరిచయం చేసారు మేకర్స్. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మరియు నటుడు అనురాగ్ కశ్యప్ ఈ ప్రాజెక్ట్‌లో ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. అవినీతిని సహించని, ధైర్యవంతుడైన అయ్యప్ప భక్తుడైన నిర్భయ ఇన్‌స్పెక్టర్‌గా కనిపించనున్నాడు అనురాగ్. ఈ సందర్భంగా అనురాగ్ తన సంతోషాన్ని తెలియజేస్తూ “అయ్యప్ప భక్తుడైన పోలీస్ అధికారిగా నటించడం సరదాగా మరియు సవాలుతో కూడుకున్నది. విధికి వ్యతిరేకంగా ధర్మం యొక్క చిక్కులు ముడి తొలగిస్తూ ఈపాత్ర చేయడం అద్భుతంగా ఉంది. ఈ పాత్రను రెండు భాషలలో పోషించడానికి నేను నిజంగా ఎదురు చూస్తున్నాను, హిందీలో మరియు తెలుగులో చిత్రీకరించడం. రెండు భాషలలో ఒకే ఎమోషన్స్ ను పండించడం సవాలుతో కూడిన భాగం, నేను పూర్తిగా ఆనందిస్తున్న విషయం.” అని అన్నారు. ఈ సినిమా హిందీ మరియు తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడుతోంది, కథ మరియు స్క్రీన్‌ప్లేను అడివి శేష్ మరియు షనీల్ డియో సంయుక్తంగా రూపొందించారు. ప్రస్తుతం, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది, తరువాత మహారాష్ట్రలో విస్తృతమైన షెడ్యూల్ జరుగుతోంది.