Site icon NTV Telugu

కుళ్లిన స్థితిలో’మీర్జాపూర్’ నటుడి మృతదేహం.. అసలేం జరిగింది..?

bollywood actor

bollywood actor

బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ‘సూపర్ 30’, ‘దంగల్’, ‘మీర్జాపూర్’ చిత్రాలతో పేరు తెచ్చుకున్న నటుడు బ్రహ్మ స్వరూప్ మిశ్రా అనుమానాస్పదంగా మృతి చెందాడు. వర్సోవాలోని సోసైటీలో అద్దెకుంటున్న గదిలో అతని కుళ్లిపోయిన మృతదేహం లభ్యమవ్వడం కలకాలంగా మారింది. మీర్జాపూర్ చిత్రంలో మున్నా భాయ్ కి అనుచరుడిగా నవ్వులు పండించి మంచి పేరుతెచ్చుకున్నారు బ్రహ్మ స్వరూప్ మిశ్రా.. గత కొన్ని రోజుల నుంచి ఆయన ఇంటినుంచి బయటకి రాలేదని స్థానికులు తెలుపుతున్నారు. బుధవారం అతను ఉంటున్న గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గది తలుపులు తెరిచి చూడగా కుళ్లిన స్థితిలో బ్రహ్మ స్వరూప్ మిశ్రా మృతదేహం లభ్యమయ్యింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహన్ని ఆసుపత్రికి తరలించారు. బ్రహ్మ స్వరూప్ మిశ్రా గుండెపోటుతో మరణించాడని, రూమ్ లో ఒక్కడే ఉండడంతో ఎవరికి ఈ విషయం తెలియలేదని, దాదాపు మూడురోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉండవచ్చని వైద్యులు తెలిపారు. బ్రహ్మ స్వరూప్ మిశ్రా మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version