Bollywood : సినీ ఫక్కీలో లేడిప్రొడ్యూసర్ ‘డైమండ్ ఇయర్ రింగ్స్’ కొట్టేశారు

Bollywood

Bollywood

సినిమాలు ప్రభావం ఆడియన్స్ పై ఖచ్చితంగా ఉంటుంది అనడానికి ఇటీవల బాలీవుడ్లో జరిగిన ఓ భారీ దోపిడీనే ఉదాహరణగా తీసుకోవచ్చు. బాలీవుడ్ అగ్ర హీరో ‘అనిల్ కపూర్’ చిన్న కూతురైన ‘రియా కపూర్’ ఇటీవల న్యూ యార్క్ లో జరిగిన ‘మెట్ గాలా’ అనే ఫ్యాషన్ ఈవెంట్ కోసమని ముంబైలో దాదాపు కోటి ముప్ఫైదు లక్షలు విలువ చేసే రెండు జతల డైమండ్ ఇయర్ రింగ్స్ ను అద్దెకు తీసుకున్నారు. అయితే ఆ రెండు జతల ఇయర్ రింగ్స్ న్యూ యార్క్ చేరుకునేలోగా మిస్ అయ్యాయి. దీంతో రియా షాక్ కి గురయింది.

ఇక ‘రియా కపూర్’ అసిస్టెంట్ ‘సవ్లీన్ సింగ్’ డైమండ్ ఇయర్ రింగ్స్ ముంబై పోలీసులకు కంప్లైంట్ చేసారు. ముంబై పోలీసులు ఈ హై ప్రొఫైల్ కేసును ఎంతో సీరియస్ గా టెక్ అప్ చేసి ఆ వజ్రాల ఇయర్ రింగ్స్ ను కాజేసిన వ్యక్తిని పట్టుకునే పని లో పడ్డారు. పోలీసులు కథనాలు ప్రకారం ‘రియా కపూర్’ తన ఖరీదైన ఇయర్ రింగ్స్ ను ఎప్పటి లాగానే తన మేక్ అప్ ఆర్టిస్ట్ ‘సవ్లీన్ సింగ్’ వద్దనే ఉంచింది. ముంబైలో ఫ్లైట్ ఎక్కేముందు కూడా రింగ్స్ ఉన్నాయట. కానీ దుబాయ్ నుండి న్యూయార్క్ లోని హోటల్ కు  చేరేసరికి కనపడకుండా పోయాయి. హోటల్ కు వెళ్ళి పర్సు తెరిచి చూస్తే కేవలం వాళ్ళకు ఖాళీ పెట్టి మాత్రమే కనిపించింది. దీంతో ఈ డైమండ్ ఇయర్ రింగ్స్ ను గాల్లోనే మాయమయ్యాయని అనుమానం వ్యక్తం చేస్తోంది రియా. ఇదిలా ఉండగా 2024లో ‘రియా కపూర్’  నిర్మించిన ‘ క్రూ’ సినిమాలో చూపించినట్లే ఫ్లైట్ జర్నీ టైం లోనే ఫ్లైట్ సిబ్బంది కాజేసి ఉంటారని సీసీటీవీ ఫుటేజ్‌లను, ప్రయాణ రికార్డులను, హోటల్ వివరాలను ఇలా అన్నిటిని సేకరిస్తూ దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

×
×
Ad