Site icon NTV Telugu

LIGER: బోల్డ్ పిక్చర్‌‌తో ఆశ్చర్యపర్చిన విజయ్ దేవరకొండ!

Vijay Deverakonda Liger

Vijay Deverakonda Liger

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబో తెరకెక్కుతున్న ‘లైగర్’ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ప్రొమోషనల్ మెటిరియల్ తో చిత్ర యూనిట్ అంచనాలను మరింతగా పెంచుతోంది. విజయ్ దేవరకొండ పాత్రను సూచించే సాలా క్రాస్‌ బ్రీడ్ అనే ట్యాగ్‌లైన్ బోల్డ్‌గా, ప్రభావవంతంగా అనిపిస్తోంది. దీనికి తగ్గట్టుగా ‘లైగర్’ టీమ్ ఒక స్టన్నింగ్ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ దాదాపు నగ్నంగా తన దేహాన్ని ప్రదర్శించి ఆశ్చర్యపరిచారు. ఇలా కనిపించడానికి చాలా ధైర్యం ఉండాలి. విజయ్ దేవరకొండ బ్రేవ్‌హార్ట్ అని మరోసారి రుజువైయింది. తాను పెద్ద స్టార్ అయినప్పటికీ పాత్ర విషయంలో ఎలాంటి హద్దులు, సంకోచాలు పెట్టుకోరని ఈ పోస్టర్ తో స్పష్టమైయింది. దమ్మున్న కథనంతో వస్తున్న ‘లైగర్’ చిరకాలం గుర్తుండిపోయే చిత్రం కాబోతుందన్నది ఈ పోస్టర్ తోనే అర్థమౌతోంది. ఎంఎంఎ ఫైటర్‌ గా నటించడానికి విజయ్ దేవరకొండ పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు ‘నా సర్వస్వం తీసుకున్న సినిమా ఇది. నటన పరంగా, మానసికంగా, శారీరకంగా నాకిది మోస్ట్ ఛాలెంజింగ్ రోల్. నేను మీకు అన్నీ ఇస్తాను! త్వరలో. #లైగర్” అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.

లెజెండ్ బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రను పోషించారు. ఇటివలే ఆయన పుట్టినరోజు ప్రత్యేక కానుకగా లైగర్ టీం విడుదల చేసిన వీడియో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇటీవల ముంబైలో లీడ్ పెయిర్‌ విజయ్ దేవరకొండ, అనన్య పాండేపై పై ఒక పాటను చిత్రీకరించారు. త్వరలోనే ప్రమోషన్‌ లను ప్రారంభించి రెగ్యులర్ అప్‌డేట్స్ తో రాబోతున్నారు చిత్ర బృందం. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

Exit mobile version