Site icon NTV Telugu

Bheemla Nayak: సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో సెలబ్రేషన్స్ షురూ!

Bheemla-Nayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ఢీ అంటే ఢీ అన్నట్టుగా నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీకి మొదటి ఆట నుండే ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఆ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్స్ మెంట్స్ లో పండగ వాతావరణం నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు సాగర్ కె చంద్ర, ఆర్ట్ డైరెక్టర్ ఎ. ఎస్. ప్రకాశ్, చిత్ర నాయిక సంయుక్త మీనన్ సంస్థ కార్యాలయంలో బాణసంచా కాల్చి తమ హర్షాన్ని వెలిబుచ్చారు. అనంతరం విక్టరీ కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

Read Also : RC15 video leaked : షూటింగ్ లో చెర్రీ అలా…

విశేషం ఏమంటే… సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు 2022 బాగా కలిసొచ్చింది. ఓ రకంగా ఈ యేడాది శుభారాంభాన్ని పలికింది. ఈ నెల 12వ తేదీ విడుదలైన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘డీజే టిల్లు’ చక్కని విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కేవలం పదమూడు రోజులకే ఇదే సంస్థ నుండి వచ్చిన ‘భీమ్లా నాయక్’ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా సాగుతోంది. దాంతో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలోని అందరిలో కొత్త జోష్ నెలకొంది. ‘డీజే టిల్లు’ అతి త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. గత యేడాది ఈ సంస్థ నుండి వచ్చిన ‘రంగ్ దే’, ‘వరుడు కావలెను’ చిత్రాలకు మంచి టాక్ వచ్చినా, కమర్షియల్ గా పెద్దంత వర్కౌట్ కాలేదు. కానీ ఈ యేడాది మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’తో పాటు ‘డీజే టిల్లు’ సైతం విజయం కావడంతో అందరి దృష్టి ఈ సంస్థ నుండి రాబోతున్న కొత్త చిత్రాలపై పడింది. మరో విశేషం ఏమంటే… ఇదే యేడాది సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ‘జెర్సీ’ హిందీ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తోంది.

Exit mobile version