NTV Telugu Site icon

Maa Oori Polimera 2: మా ఊరి పొలిమేర2కి మెంటలెక్కించే కలెక్షన్లు

Maa Oori Polimera 2

Maa Oori Polimera 2

Blasting openings for Maa Oori Polimera 2 : అందరిలో ఆసక్తి రేకెత్తిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఊరి పొలిమేర 2 బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ ఓపెనింగ్స్ అందుకుంది. పొలిమేర పార్ట్ 1 హైప్‌తో విడుదలైన ఈ సినిమా మొదటి రోజునే కలెక్షన్స్ విషయంలో పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఇంత స్థాయిలో పెర్ఫామ్ చేస్తుందని ఎవరూ ఊహించని విధంగా సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల వారు తేల్చారు. 1వ రోజు సినిమా నూన్ షోలు అద్బుతంగా ప్రారంభమయ్యాయి. ఆ తరువాత ఒక్కో షోకి కలెక్షన్లు పెరిగాయి, నైట్ షోలకు సినిమా హౌస్ ఫుల్స్‌ను కూడా నమోదు చేసింది. చాలా సెంటర్లలో ఈ సినిమాకు ఊహించిన దానికంటే భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.

My Name is Shruthi: వామ్మో అమ్మాయిల్ని ఇలా కూడా చేస్తారా.. హన్సిక కొత్త సినిమా ట్రైలర్ వణికిస్తోంది

సీక్వెల్ కావడం వల్ల సినిమాకు వచ్చిన హైప్ ఒక రేంజ్ లో ఉందని శుక్రవారం నాటి కలెక్షన్లు నిరూపించాయి. అన్ని సెంటర్లలో, భారీ సంఖ్యలో విడుదలైన ఈ చిత్రం, మాస్ సెంటర్లలో అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. ఈరోజు రేపు అంటే శని, ఆదివారాల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. మొత్తంమీద, ఈ చిత్రం బయ్యర్‌లకు జాక్‌పాట్‌గా మారింది, 1వ వారాంతంలో వసూళ్లతో భారీ లాభాలను వస్తాయని అంచనా. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకుడుగా వ్యవహరించిన మా ఊరి పొలిమేర 2 ప్రధాన పాత్రల్లో సత్యం రాజేష్ – కామాక్షి భాస్కర్ల నటించారు. అలాగే ఈ సినిమాలో గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహితీ దాసరి మరియు రవివర్మ కూడా కీలక పాత్రలు పోషించారు.