Birthday special : భలేగా సాగుతున్న బ్రహ్మాజీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్రసీమ తల్లివంటిది. సినిమా రంగాన్ని నమ్ముకుంటే ఏదో ఒక రోజున ఆ తల్లి కరుణించక మానదు అంటారు. ఎందరో అలాగే నమ్ముకొని సినిమా రంగంలో తమదైన బాణీ పలికించారు. నటుడు బ్రహ్మాజీ కెరీర్ ను పరిశీలించి చూస్తే అది నిజమే అనిపించక మానదు. తన తరం వారు హీరోలుగా వెలిగినా, ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఉన్నారు. బ్రహ్మాజీ మాత్రం ఇప్పటికీ బిజీగానే సాగుతున్నారు. తనకంటే వయసులో ఎంతో చిన్నవారయిన నటులతోనూ ఫ్రెండ్ గా నటించేస్తూ సందడి చేస్తున్నారు బ్రహ్మాజీ.
బ్రహ్మాజీ 1965 ఏప్రిల్ 25న తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు. బ్రహ్మాజీకి నటుడు కావాలన్న అభిలాష కలిగించిన వారు ‘శంకరాభరణం’లో శంకరశాస్త్రిగా నటించిన జె.వి.సోమయాజులు. అదెలాగంటే, బ్రహ్మాజీ తండ్రి తాసిల్దార్ గా పనిచేసేవారు. ఆ సమయంలో జె.వి.సోమయాజులు డిప్యూటీ కలెక్టర్. సోమయాజులు రంగస్థలంపై మేటి నటులు. అందువల్లే ‘శంకరాభరణం’లో కీలక పాత్ర పోషించారు. ఆ సినిమా విజయం సాధించిన తరువాత ఏర్పాటు చేసిన సన్మానసభలో బ్రహ్మాజీ తండ్రి, ఆయన సహోద్యోగులు అందరూ, క్యూలో నించుని మరీ సోమయాజులు ఆశీసులు తీసుకున్నారు. ఒక్క సినిమాతోనే సోమయాజులకు అంత కీర్తిప్రతిష్ఠలు రావడం చూసిన బ్రహ్మాజీకి తాను కూడా సినిమా రంగంలో రాణించాలన్న ఆలోచన కలిగింది.
Also Read
- Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
- Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే
- I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
- RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా?
అది రోజురోజుకూ పెరిగింది. దాంతో చెన్నై చేరిపోయారు. ఆరంభంలో బ్రహ్మాజీని భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎస్.గోపాల్ రెడ్డి ప్రోత్సహించారు. ఆయన చిత్రాలతో కాసింత గుర్తింపు వచ్చాక, ఇతరుల సినిమాల్లోనూ నటించసాగారు బ్రహ్మాజీ. తన దరికి చేరిన అన్ని పాత్రలనూ పోషిస్తూ వచ్చారు. ఎక్కువగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే పలకరించాయి. అయినా నిరుత్సాహ పడలేదు. చిత్రసీమలో వేషాల వేట సాగిస్తూ ఉన్న రోజుల్లోనే బ్రహ్మాజీకి కృష్ణవంశీ, రవితేజ వంటివారితో పరిచయం ఏర్పడింది. కలసి మెలసి ఉంటూ, ఒకరికొకరు కష్టాలు చెప్పుకుంటూ సాగారు. కృష్ణవంశీ కారణంగా రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం ‘శివ’లో బ్రహ్మాజీకి ఓ చిన్న వేషం లభించింది. తరువాత కృష్ణవంశీ మొదటి సినిమా ‘గులాబి’లో హీరో జేడీ చక్రవర్తికి స్నేహితునిగా ఉంటూనే, మోసం చేసే పాత్రలో నటించారు బ్రహ్మాజీ. ఆ సినిమా మంచి పేరు సంపాదించి పెట్టింది. కృష్ణవంశీ రెండో చిత్రం ‘నిన్నే పెళ్ళాడతా’లో కామెడీ మిళితమైన పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. ఇక ఆ పై బ్రహ్మాజీ మరి వెనుతిరిగి చూసుకోలేదు.
మిత్రుడు కృష్ణవంశీ ఎప్పటికప్పుడు బ్రహ్మాజీని వైవిధ్యమైన పాత్రల్లో చూపిస్తూ వచ్చారు. బ్రహ్మాజీ హీరోగా ‘సిందూరం’ నిర్మించి, దర్శకత్వం వహించారు కృష్ణవంశీ. ఆ సినిమా ఆట్టే ఆకట్టుకోలేక పోయింది. అయినా కృష్ణవంశీ చిత్రాల్లో ఏదో ఒక విలక్షణమైన పాత్రలో కనిపిస్తూనే ఉండేవారు బ్రహ్మాజీ. మెల్లమెల్లగా బ్రహ్మాజీ కేరెక్టర్ రోల్స్ లో సెట్ అయిపోయారు. ఆ తరువాత నుంచీ బిజీ బిజీగా సాగుతున్నారు. యంగ్ హీరోస్ సినిమాల్లో బ్రహ్మాజీ ఉండడం ఓ ఎస్సెట్ గా మారిపోయింది. అందువల్ల పలు సినిమాల్లో బ్రహ్మాజీ నవ్విస్తున్నారు, కవ్విస్తున్నారు. సరదాగా సాగిపోతున్నారు. తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించిన బ్రహ్మాజీకి ఇప్పుడు మాతృభాషలోనే తీరిక లేకుండా ఉంది. ఏది ఏమైనా చిత్రసీమలో రాణించాలని వచ్చిన బ్రహ్మాజీ పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Sonal Dinusha: టీమిండియాపై సెంచరీలు.. ఆ కిక్కే వేరప్పా.. గాల్లో తేలిపోతున్న శ్రీలంక హీరో!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!