Bimbisara Pre Release Event Live Updates :
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బింబిసార. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ పెంచేసిన చిత్ర బృందం నేడు శిల్పకళా వేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహిస్తోంది. ఇక ఈ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్ఛేయనున్నాడు.
కళ్యాణ్ అన్న కెరీర్ బింబిసార కు ముందు బింబిసార తరువాత అని అనుకోవడం కాదు ఖచ్చితంగా అనుకుంటారు. మామూలుగానే ఆయన చాలా కష్టపడతారు. ఆ కష్టం నిజంగానే తెరపై కనిపించదు. తమ్ముడిని కాబట్టి ఎక్కువసార్లు ఆయనను కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు తెలుసు ఆయన ఎంత కష్టపడతారో అని.. ఈ సినిమాకు నిజంగా కళ్యాణ్ రామ్ తన రక్తాన్ని ధారపోసి.. ఒక నటుడిగా తనను తాను మలుచుకున్నాడు. కళ్యాణ్ రామ్ లేకపోతే.. బింబిసార ప్లేస్ లో ఎవరిని ఉహించుకోలేం. ఇండస్ట్రీకి గడ్డుకాలం అంటున్నారు. థియేటర్స్ కు ప్రేక్షకులు రావడం లేదంటున్నారు.. ఇవన్నీ నేను నమ్మను. అద్భుతమైన సినిమా వస్తే.. చూసి ఆశీర్వదించే గొప్ప తెలుగు ప్రేక్షక దేవుళ్లు మీరందరు.. బింబిసార ను ఆదరిస్తారని, అలాగే ఈ సినిమాతో పాటు సీతారామం కూడా వస్తోంది .. ఆ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ఈసారి తాను ఎవ్వరినీ డిజప్పాయింట్ చేయనని తన ‘బింబిసార’ చిత్రంపై నమ్మకం వెలిబుచ్చాడు హీరో కళ్యాణ్ రామ్. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ సాక్షిగా కళ్యాణ్ ఆ మాట చెప్పాడు. ఈ సినిమా చూసిన తర్వాత 100కి రెండు వందల శాతం మీరు తప్పకుండా శాటిస్ఫై అవుతారని అన్నాడు. తమ తామ ఎన్టీ రామారావు పుట్టిన 100వ సంవత్సరంలో వస్తోన్న ఈ సినిమా ప్రతీ నందమూరి అభిమానిని గర్వపడేలా చేస్తుందన్నాడు. తెలుగు సినిమాకి, తమ కుటుంబానికి మూల కారకుడైన ఆయనకు ఈ సినిమాను అంకితం చేస్తున్నానని తెలిపాడు.
ఎట్టకేలకు అభిమానుల కేరింతల మధ్య ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. సుమ ఎన్టీఆర్ కు స్వాగతం పలికింది. బ్లాక్ టీ షర్ట్ లో ఎన్టీఆర్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ఇక ఎన్టీఆర్ ను చూడగానే అభిమానుల కేకలతో శిల్ప కళావేదిక దద్దరిల్లింది.
క్యాథరిన్ థెరిస్సా మాట్లాడుతూ.. ఈ సినిమా చేయడం నా అదృష్టం.. ఈ సినిమాలో చేయడానికి నాకు చాలా రీజన్స్ ఉన్నాయి. చాలా ఏళ్ల తరువాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ లో చేస్తున్నాను. కళ్యాణ్ రామ్ చాలా బాగా చేశారు. ఈ ఐరా పాత్రను నాకు ఇచ్చినందుకు వశిష్ట్ కు థాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుంది. అందరు తప్పకుండా సినిమ చూడాలి.
ఛోటా కె నాయుడు మాట్లాడుతూ.. కళ్యాణ్ రామ్ సినిమాలో చాలా బాగా చేశాడు.. అంతకు ముందు మీరు చూసిన కళ్యాణ్ రామ్ వేరు.. బింబిసార కళ్యాణ్ రామ్ వేరు.. 12 షాట్స్ ఉన్నాయి.. ఒక లోయలో చేయాల్సి వచ్చింది. నేను ఎలా అని ఆలోచిస్తుండగా.. కళ్యాణ్ రామ్ పర్వాలేదు నేను చేస్తాను అని చెప్పి సొంతంగా కష్టపడి చేశాడు. ఇందులో కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం చూపించాడు. బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ చింపి పడేశాడు.
బింబిసార ప్రీ రిలీజ్ వేడుకకు కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఇచ్చాడు. బింబిసార లుక్ లోనే కళ్యాణ్ రామ్ కనిపించాడు. అభిమానుల కేరింతల మధ్య కళ్యాణ్ రామ్ వేదికను అలకరించాడు.
జై బాలయ్య నినాదాలతో శిల్పాకళా వేదిక దద్దరిల్లిపోతోంది. నందమూరి హీరోలకు సంబంధించిన స్పెషల్ వీడియోలను ప్లే చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ వీడియో ప్లే చేసిన మేకర్స్.. నందమూరి బాలకృష్ణ స్పెషల్ వీడియో ను ప్లే చేశారు. ఇక చివర్లో ఈ వేడుకకు బాలకృష్ణ వస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సర్ ప్రైజ్ ను ఊహించని అభిమానులు ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు.
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావును మరోసారి గుర్తుచేసింది బింబిసార వేదిక. ఎన్టీఆర్ చిన్నతనం నుంచి ఆయన పోషించిన పాత్రలు, ఆయన గురించి ప్రముఖులు చెప్పిన వ్యాఖ్యలను ఒక వీడియో ద్వారా అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. తెరపై సీనియర్ ఎన్టీఆర్ ను చూడగానే నందమూరి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఆయనను స్మరించుకున్నారు.
బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సుమ మొదలుపెట్టింది. బింబిసార డైలాగ్స్ ను తన స్టైల్లో చెప్తూ నందమూరి అభిమానులను ఉత్తేజపరిచింది. బింబిసార, టీజర్, ట్రైలర్ ను మరోసారి అభిమానులకు చూపించింది.
నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సాంగ్స్ తో అభిమానులను అలరిస్తున్నారు సింగర్స్. ఎన్నో రోజుల తరువాత అన్నదమ్ములు ఒకే వేదికపై కనిపించనుండడంతో అభిమానుల్లో ఆనందోత్సాహం ఎగిసిపడుతోంది.
ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వస్తున్నాడు అని తెలియడంతో నందమూరి ఫ్యాన్స్ ఉత్సాహం ఆకాశానికి తాకుతోంది. బయట వర్షాన్ని కూడా లెక్కచేయకుండా నందమూరి అభిమానులు శిల్పా కళావేదికకు చేరుకున్నారు.