Site icon NTV Telugu

Bimbisara 2: ‘బింబిసార 2’ లో బాలయ్య.. నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలే..?

Balayya

Balayya

Bimbisara 2: నందమూరి కళ్యాణ్ రామ్ ఎట్టకేలకు ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కొత్త దర్శకుడితో హిట్ కొడతాడా..? అని అనుమానించిన ప్రతి ఒక్కరి నోరును తన విజయంతో మూయించేశాడు. వశిస్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం బింబిసార ఇటీవలే రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకొన్న విషయం విదితమే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కళ్యాణ్ రామ్ ప్రమోషన్స్ లోనే ప్రకటించాడు. అంతేకాకుండా ఈ సీక్వెల్ లో ఎన్టీఆర్ కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో బింబిసార కన్నా బింబిసార 2 కోసమే అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ సీక్వెల్ కు సంబంధించిన ఒక వార్త నందమూరి అభిమానులను నిద్రపట్టనివ్వడంలేదు.

అదేంటంటే.. ఈ సీక్వెల్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ఒక గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడట.. ఇటీవలే బింబిసార చూసిన బాలయ్య కళ్యాణ్ రామ్ ను, డైరెక్టర్ ను ప్రశంసలతో ముంచెత్తిన విషయం విదితమే. వశిస్ట్ తో త్వరలోనే మనం చేద్దాం అని చెప్పడంతో ఈ సీక్వెల్ లో బాలయ్య కూడా కనిపించే అవకాశాలు ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. ఇదే కనుక నిజమైతే నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలే.. బాబాయ్.. అబ్బాయిలు కలిసి నటించాలని ఎప్పటినుంచి నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. ఇది బింబిసార లాంటి పౌరాణిక సినిమాతో కనుక నిజమైతే ఆ ఇంపాక్ట్ వీర లెవల్లో ఉంటుందని అభిమానుల అంచనా.. మరి అభిమానుల కోరియుక నెరవేరుతుందేమో చూడాలి.

Exit mobile version