సైడ్ క్యారెక్టర్స్ నుండి హీరోగా మేకోవరైన శర్వానంద్ ఒక్క హిట్ కొట్టాడు అనుకునేలోపు నెక్ట్స్ మూవీతో ఫ్లాప్‌కు హాయ్ చెప్పాల్సిందే. మహానుభావుడు తర్వాత వరుస పరాజయాలకు ఒకే ఒక జీవితంతో చెక్ పెడితే మనమే మళ్లీ అతడి స్పీడుకు బ్రేకులేసింది. ఇక నెక్ట్స్ హోప్ బైకర్ మూవీపైనే. ఈ రేసింగ్ మూవీ కోసం గట్టిగానే కష్టపడ్డాడు శర్వా. మునుపెన్నడూ లేనివిధంగా ఒళ్లు హునం చేసుకుని వెయిట్ లాస్ అవడమే కాకుండా ఫిట్‌గా తయారయ్యాడు.
Also Read : Tollywood : హ్యాట్రిక్ ప్లాపులు… అయినా సరే వరుస సినిమాలు చేస్తున్న ఇద్దరు యుంగ్ బ్యూటీస్
బైక్ రేసింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది బైకర్. శర్వాతో జోడీ కడుతోంది మలయాళ కుట్టీ మాళవిక నాయర్. టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. మా నాన్న సూపర్ హీరో ఫేం అభిలాస్ కంకర ఈ సినిమాకు దర్శకుడు. యువి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. డిసెంబర్ 6న థియేటర్లలోకి రాబోతోంది బైకర్. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న బాలయ్య అఖండ2తో పోటీ పడుతున్నాడు శర్వానంద్. శర్వానంద్ చేతిలో బైకర్ మాత్రమే కాదు, టూ ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. నారీ నారీ నడుమ మురారి, భోగి చిత్రాలున్నాయి. నారీ నారీ నడుమ మురారి షూటింగ్ కంప్లీట్ కాగా, నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ బైకర్ డిసెంబర్‌కు వచ్చేస్తుండటంతో కాస్త గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇక హిట్ మొహం చూసి మూడేళ్లు దాటిపోతున్న శర్వానంద్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్ మాత్రం ఈ యంగ్ హీరోతో దోబూచులాడుతోంది. శర్వాని మార్కెట్ ని మించి ఖర్చు చేసిన ఈ సినిమాతో హిట్ కొట్టి ఎలాగైనా ట్రాక్ ఎక్కాలని ఎదురుచూస్తున్నాడు.
