Site icon NTV Telugu

BiggBoss Telugu 7: మధ్యలో మాట్లాడితే పగిలిపోతుంది.. అమర్ ఓవర్ యాక్షన్

Amar

Amar

BiggBoss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. రోజురోజుకు ఉత్కంఠను కలిగిస్తున్నా.. నామినేషన్స్ సమయానికి వచ్చేసరికి ప్రేక్షకులకు చిరాకును తెప్పిస్తుంది. సిల్లీ సిల్లీ రీజన్స్ తో కంటెస్టెంట్లు గంట గొడవపడుతూ చూసేవారికి ఏంట్రా బాబు ఈ టార్చర్ అనేలా చేస్తున్నారు. ప్రతి నామినేషన్ లో.. అమర్, పల్లవి ప్రశాంత్, శోభా, భోలే షావలి, గౌతమ్ చేసే రచ్చ అంతా ఇంతాకాదు. ముఖ్యంగా అమర్ దీప్.. ఈ నామినేషన్ లో చాలా ఓవర్ యాక్షన్ చేసినట్లు కనిపిస్తోంది. గతరాత్రి.. శివాజీ.. ప్రియాంక, శోభను నామినేట్ చేయగా, శోభ.. శివాజీ, భోలే ను నామినేట్ చేసింది. భోలే బూతులు మాట్లాడి సారీ చెప్పినా కూడా కనీసం వయసుకు మర్యాద ఇచ్చి క్షమించే గుణం లేని శోభను పద్దతి మార్చుకోమని శివాజీ చెప్పిన పాయింట్ ను వేరేలా తీసుకొని అతడితో గొడవపడింది. ఇక పల్లవి ప్రశాంత్, గౌతమ్ నామినేషన్ అయితే అస్సలు అర్థంపర్థం లేకుండానే సాగింది. ఇక సందీప్ అయితే.. ఓటిటీ లో బూతు కంటెంట్ వస్తే నా కొడుకుతో కూడా చూడను.. ఇప్పుడు వాడు ఈ షో చూస్తే అందులో ఇలాంటి మాటలు ఉంటే ఎలా అని భోలేను నామినేట్ చేశాడు.

Renu Desai: పవన్ సీఎం అవ్వాలని నేను కోరుకోను.. సపోర్ట్ కూడా ఇవ్వను

ఇక ఈరోజు నామినేషన్స్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో తేజ, అశ్విని కి మధ్య గొడవ చూపించారు. ఈ ప్రోమోలో అమర్ చాలా ఓవర్ చేసాడని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. ప్రశాంత్ .. అమర్ ను నామినేట్ చేయగా.. వారిద్దరి మధ్య భోలే కలుగ చేసుకున్నాడని.. కాలితో కుర్చీని తన్ని.. మధ్యలో మాట్లాడితే పగిలిపోతుంది అంటూ ఫైర్ అయ్యాడు. అంతేకాకుండా ప్రశాంథ్ వెనుక శివాజీ, యావర్ ఉన్నారని.. ఎత్తిపొడుస్తూ మాట్లాడాడు. దానికి శివాజీ.. నీకు అవసరమైనప్పుడు ఒకలాగా.. అవసరం లేనప్పుడు మరోలాగా మాట్లాడతావా.. ? ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో తెలుస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఈ నామినేషన్స్ వలన ఈ వారం ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Exit mobile version