BiggBoss 6: రోజురోజుకూ బిగ్ బాస్ 6 మరింత ఘోరంగా తయారవుతుంది. ముఖ్యంగా రేవంత్, గీతూల బిహేవియర్ కంటెస్టెంట్స్ కే కాదు చూసే ప్రేక్షకులకు కూడా చిరాకు తెప్పిస్తోంది. ఇద్దరికీ ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ అసలు షో చూడాలనే ఇంట్రెస్ట్ నే ప్రేక్షకులకు రానివ్వకుండా చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఏం పీకుతారు అంటూ ఇద్దరు చేసిన రచ్చ ఇంకా మరువకముందే మరోసారి అంతకు మించిన దారుణానికి పాల్పడ్డారు. తాజాగా కెప్టెన్సీ టాస్క్ లో చేపల చెరువు టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్ లో ఎవరి చేపలను వారు కాపాడుకోవాలి. ఈ నేపథ్యంలోనే రసవత్తరంగా పోటీ జరుగుతోంది.
ఇక పోటీలో రేవంత్ వద్ద ఉన్న చేపలను లాక్కొని గీతూ పరిగెత్తుకొంటూ వెళ్ళింది.. ఆమెను పట్టుకోవడానికి వెనక వెళ్లిన రేవంత్ ఆమెను పట్టుకోబోయి తోసేశాడు. దీంతో ఒక్కసారిగా గీతూ కిందపడడం, ఆమె కాలికి దెబ్బ తగలడం జరిగాయి. వెంటనే ఆమె దగ్గరకు వచ్చిన రేవంత్ ను గీతూ కాలితో తన్ని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక రేవంత్ ఆమెతో ఆర్గుమెంట్ చేయకుండా తన ఆటను కొనసాగించడానికి ముందుకు వెళ్లినట్లు ప్రోమోలో చూపించారు. గేమ్ లో కొట్టుకోవడం, తిట్టుకోవడం సహజమే కానీ ప్రతిసారి వీరిద్దరూ మాత్రం తమ పర్సనల్ గ్రడ్జ్స్ మైండ్ లో పెట్టుకొని టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తుందని అభిమానులు అంటున్నారు. మరి ఈ గేమ్ లో విన్నర్ ఎవరు అవుతారు అనేది చూడాలంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే.