Site icon NTV Telugu

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్ లో అర్ధరాత్రి షకీలాకు పానిక్ ఎటాక్..?

Shakee

Shakee

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. రోజురోజుకు ఆసక్తిని పెంచుతుంది. ఇక కంటెస్టెంట్ల మధ్య మొదటి రోజునుంచే చిచ్చు పెట్టి.. వినోదాన్ని ఇంకా పెంచాడు బిగ్ బాస్. ఒకపక్క అందరూ కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తున్నా.. ఇంకోపక్క ఒకరిపై ఒకరు రుసరుసలాడుకుంటున్నారు. ఇక మూడు రోజులుగా ఇంట్లో కాఫీ వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే. కాఫీ కోసం శివాజీ.. బిగ్ బాస్ పై ఫైర్ అవ్వడం.. బిగ్ బాస్ ఇంకా రెచ్చగొట్టడం జరిగింది. దీంతో కంటెంట్ బాగానే ఉందని ప్రేక్షకులు అనుకొనేలోపు ఒక అనూహ్య సంఘటన బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ను బెంబేలెత్తించింది. అదేంటంటే.. సీనియర్ నటి షకీలాకు.. అర్ధరాత్రి పానిక్ ఎటాక్ రావడంతో మిగిలినవారు బెంబేలలెత్తిపోయారు. సడెన్ గా ఆమె బెడ్ మీద కూర్చొని ముందుకు వెనక్కి ఊగుతూ.. ఎవరో వస్తున్నారు.. నన్ను పట్టుకోండి.. అంటూ గట్టిగా కేకలు పెట్టింది.

Athidhi Trailer: హర్రర్ లవర్స్ రెడీగా ఉండండి.. ప్యాంట్ తడిచిపోయే సిరీస్ వస్తుంది

ఇక వెంటనే డాక్టర్ అయిన గౌతమ్ ఆమెను చెక్ చేసి.. బిగ్ బాస్ కు తెలిపాడు. ఆమె పరిస్థితి బాలేదని , వెంటనే బీపీ, సెలైన్స్ కావాలని తెలిపాడు. ఇక శివాజీ .. షకీలా పరిస్థితిని అర్ధం చేసుకొని ఆమె దగ్గరకు వెళ్లి.. ఏం కాదు .. నేనున్నా అని దగ్గర కూర్చొని ఆమెకు దైర్యం చెప్పి ఆమెను పడుకోబెట్టాడు. అంతేకాకుండా ఆమె కాళ్లు పట్టి నిద్రపోయేవరకు ఉన్నాడు. అయినా సడెన్ గా ఆమె లేచి.. నన్ను ఎవరో పిలుస్తున్నారు.. ? నా దగ్గరకు ఎవరో వస్తున్నారు.. ? అంటూ అరవడంతో కంటెస్టెంట్స్ భయపడిపోయారు. ఆమెకు ఏదైనా దెయ్యం పట్టిందా.. ? అని ప్రేక్షకులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version