ఇక 24 గంటలూ ‘బిగ్ బాస్’ షో… హోస్ట్ గా బాలయ్య ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” భారీ విజయాన్ని సాధించింది. ఈ షో ఎండింగ్ లో హోస్ట్ నాగార్జున సీజన్ 6 గురించి హింట్ ఇచ్చారు. అయితే తాజాగా “బిగ్ బాస్” తదుపరి సీజన్ టెలివిజన్‌తో పాటు డిస్నీ+ హాట్ స్టార్ లో ప్రసారం కావడంతో డిజిటల్‌గా మారుతుందని ప్రకటించారు. షోకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ 24X7 ప్రత్యక్ష ప్రసారం కానుంది. ‘బిగ్ బాస్’ ప్రేమికులు ఈ సరికొత్త సీజన్ ను మొబైల్‌లు, టాబ్లెట్‌లలో కూడా చూడవచ్చు. అయితే గత ఎపిసోడ్ కు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జునే ఈ కొత్త సీజన్ కు కూడా వ్యాఖ్యాతగా చేస్తారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ షోను నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కి హోస్ట్‌గా నందమూరి బాలకృష్ణను నియమించాలని షో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ‘ఆహా’లో ప్రస్తుతం ప్రసారం అవుతున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ షోతో హోస్ట్ గా బాలయ్య తన అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ బాలకృష్ణ ఈ షోను హోస్ట్ చేయడానికి ఆసక్తి చూపితే, నాగార్జున షో నుండి తప్పుకునే అవకాశం ఉంది. టాలీవుడ్ కింగ్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని, తన షెడ్యూల్ మధ్య ఈ కొత్త ‘బిగ్ బాస్’ను హోస్ట్ చేయలేకపోవచ్చు అని అంటున్నారు. కాగా “బిగ్ బాస్ ఓటిటి సీజన్ 1” 2022 ఫిబ్రవరి మధ్యలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. బిగ్ బాస్ ఓటిటి కోసం షో మేకర్స్ ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6ని ఎవరు హోస్ట్ చేస్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read
- Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
- Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్‌లు !
- Ajith Kumar : అజిత్ కుమార్ - విక్టరీ వెంకటేష్ - మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
- King 100: నాగ్100పై సస్పెన్స్‌కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
తాజావార్తలు
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!