Bigg Boss 6: సాధారణంగా ఒక ఒరలో రెండు కత్తులు ఇమడలేవు అని సామెత.. రెండు కొప్పులు కలిస్తే యుద్ధమే అని పెద్దవారు అంటూ ఉంటారు. ఇక ఒకేచోట దాదాపు 8 మంది ఆడవారు ఉంటే యుద్ధం కాదు అంతకుమించి ఉంటుంది.. ప్రస్తుతం ఆ యుద్ధమే బిగ్ బాస్ లో నడుస్తోంది. నిన్ననే ఎంతో గ్రాండ్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మొదలైన విషయం విదితమే. ఎంతో ఆనందంగా వెళ్లిన కంటెస్టెంట్స్ కు ఒక్కరోజు కూడా సంతోషంగా ఉండనివ్వకుండా బిగ్ బాస్ టాస్కు ఇచ్చేసాడు. ఇక టాస్క్ పక్కన పెడితే.. ఉదయం నుంచే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. వర్మ హీరోయిన్ ఇనయా సుల్తానాపై చిత్తూరు చిచ్చర పిడుగు గీతూ రాయల్ విరుచుకుపడింది.
బాత్ రూమ్ లో స్నానం చేసినప్పుడు జుట్టు మొత్తం ఊడింది. అది ఎవరిది అని కేకలు వేసింది.. మిగతా వారు ఇనయా అని అనగా.. వెంటనే ఆమెతో గొడవకు దిగింది గీతూ.. హౌస్ లో అన్ని పనులు పంచుకోవాలని చెప్పగా.. అందుకు గీతూ .. హౌస్ లో నేను అన్ని పనులు చేయమన్నా చేస్తా, చివరికి బాత్ రూమ్ క్లీన్ చేయమన్న చేస్తా కానీ బాత్ రూమ్ లో జుట్టును తీసే పని అస్సలు చేయనని చెప్పుకొచ్చింది. దీంతో ఇనయా ముఖం వాడిపోయింది. ఇక టాస్క్ లో క్లాస్, ట్రాష్ లో ఎవరు ఉండాలో తేల్చుకోమని బిగ్ బాస్ చెప్పగా.. ఇనయా.. గీతూ పేరు చెప్పింది. అందుకు కారణంగా ఆమె బాత్ రూమ్ లో జుట్టు తీయనని హార్ష్ గా చెప్పుకొచ్చిందని చెప్పింది. దీంతో మొదటి రోజే రెండు కొప్పులకు మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.