Tanish: చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు తనీష్. బాలనటుడిగా తన ప్రత్యేకతను చాటుకుని తర్వాత హీరోగా టర్న్ అయ్యి.. నచ్చావులే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత కొన్ని సినిమాలు హీరోగా చేశాడు కానీ, అవి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ఇక మరికొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటించి మెప్పించాడు. అవి కూడా సెట్ కాలేదు. అయితే .. కొన్ని నెలలు సినిమాలకు గ్యాప్ ఇచ్చి మధ్యలో బిగ్ బాస్ సీజన్ 2 లో ఎంటర్ అయ్యాడు.. కోపానికి, ముక్కుసూటితనానికి బ్రాండ్ అంబాసిడర్ లా మారి బిగ్ బాస్ హౌస్ లో రచ్చ చేసి టాప్ 5 కంటెస్టెంట్ గా ప్రేక్షకులకి మరికాస్త దగ్గరయ్యాడు తనీష్.
Manchu Manoj : రవితేజ సినిమాలో విలన్ గా నటించబోతున్న మంచు మనోజ్..?
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక అడపాదడపా సినిమాలు చేస్తూ కనిపిస్తున్న తనీష్ .. తాజాగా క్రిమినల్ గా మారాడు. అంటే క్రిమినల్ అంటే ఏదో అనుకునేరు.. అది అతడు నటిస్తున్న కొత్త చిత్రం. కిశోర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ ఫ్రెండ్స్ ప్రొడక్షన్ బ్యానర్ నిర్మిస్తుంది. ఇక ఈ రోజు తనీష్ బర్త్ డే కావడంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి హీరోకు బర్త్ డే విషెస్ తెలిపారు. క్రిమినల్ పోస్టర్ లో తనీష్ కొత్తగా కనిపించాడు. ఒక్క పోస్టర్ లోనే రెండు వేరియేషన్స్ తో తనీష్ లుక్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే విడుదల చేస్తామని యూనిట్ తెలిపింది. మరి ఈ సినిమాతో తనీష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.