Darshan : ఈ నడుమ సెలబ్రిటీలు ఎక్కువగా చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ చిన్న విషయంలో గొడవపడి చివరకు అరెస్ట్ అయ్యాడు. తమిళ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన దర్శన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. అలాంటి దర్శన్ ఏకంగా ఓ జడ్జి కొడుకుతోనే గొడవ పెట్టుకున్న వ్యవహారం ఇప్పుడు తమిళ మీడియాలో వైరల్ అవుతోంది. మొన్న గురువారం నాడు దర్శన్ ఇంటి దగ్గర ఉన్న టీ షాప్ కు మద్రాస్ హైకోర్టు జడ్జి కొడుకు అత్తిచూడి తన భార్య, అత్తతో కలిసి టీ తాగడానికి వచ్చాడు. అయితే తన కార్ ను దర్శన్ ఇంటి ముందు పార్క్ చేశాడు. ఈ విషయంలో దర్శన్ అతనితో గొడవపడ్డాడు.
Read Also : CSK VS DC : సీఎస్కే పేలవమైన బ్యాటింగ్.. ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయం..
చివరకు ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో దర్శన్ ఆవేశంలో జడ్జి కొడుకు మీద దాడి చేసి కొట్టాడు. ఇంకేముంది ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో కేసుల పెట్టుకున్నారు. కానీ ఈ కేసులో దర్శన్ ను, అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్న కారు పార్కింగ్ విషయంలో వచ్చిన గొడవ చివరకు పోలీస్ స్టేషన్ల దాకా వెళ్లింది. ఈ విషయంపై దర్శన్ ఇంకా ఏమీ స్పందించలేదు. ప్రస్తుతానికి ఈ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనేది ఇంకా తెలియరాలేదు. దర్శన్ శ్రీలంకకు చెందిన వ్యక్తి. కాగా తమిళ బిగ్ బాస్ తో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. నటుడుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
