NTV Telugu Site icon

తండ్రి కాబోతున్న మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్

Bigg Boss contestant Ali Reza to become a father

ప్రముఖ బుల్లితెర నటుడు అలీ రెజా తన వ్యక్తిగత జీవితంలో ఒక అందమైన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. అలీ, అతని భార్య మసుమ్ త్వరలో తల్లిదండ్రులు కానున్నారు. తాజాగా అలీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ స్పెషల్ న్యూస్ ను తన అభిమానులతో పంచుకున్నారు. ఆయన తన గర్భిణీ భార్యతో కలిసి నడుస్తున్న ఒక అందమైన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. “మా ఈ కొత్త ప్రయాణంలో కలిసి నడుస్తున్నాం” అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. దీంతో అలీ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also : ఫస్ట్ లుక్ : యంగ్ లుక్ లో ఆకట్టుకుంటున్న “అన్నాత్తే”

“బిగ్ బాస్ తెలుగు సీజన్ 3″లో కంటెస్టెంట్ గా పాల్గొని అలీ విశేష సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. అలీ స్టైల్, సిక్స్ ప్యాక్ బాడీతో బిగ్ బాస్ తో పాటు ప్రేక్షకులను కూడా ఫిదా చేసేశాడు. ఒకసారి ఎలిమినేట్ అయ్యి, మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్ లో దుమ్మురేపాడు. “బిగ్ బాస్” టైటిల్ గెలకపోయినా అభిమానులను మాత్రం గట్టిగానే సంపాదించుకున్నాడు. అలీ “సావిత్రి”అనే తెలుగు సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. “గాయకుడు” చిత్రంతో హీరోగా ఎదిగాడు. అలీ చివరిసారిగా ఆహా సిరీస్ “మెట్రో కథలు”లో కనిపించాడు. ఇటీవల ఓ చిత్రానికి సంతకం చేశాడు.

View this post on Instagram

A post shared by Ali Reza (@i.ali.reza)