ఫస్ట్ లుక్ : యంగ్ లుక్ లో ఆకట్టుకుంటున్న “అన్నాత్తే”

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “అన్నాత్తే” వచ్చేసింది. రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో “అన్నాత్తే” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇంతకుముందు రజనీకాంత్ సూపర్ హిట్‌ సినిమాలు ఎందిరన్, పెట్టా లను కూడా ఈ బ్యానర్ పైనే నిర్మించారు. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సూరి, సతీష్, బాల (దర్శకుడు శివ సోదరుడు) వంటి ప్రముఖులు ప్రధాన పాత్రలలో నటించారు. డి ఇమ్మాన్ సంగీతం అందించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈరోజు వినాయక చవితి సందర్భంగా “అన్నాత్తే” నుంచి రజినీకాంత్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.

Read Also : ఖిలాడీ : “ఇష్టం” లిరికల్ వీడియో సాంగ్

ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న “అన్నాత్తే” ఫస్ట్ లుక్ ను ఈ రోజు (సెప్టెంబర్ 9) ఉదయం 11 గంటలకు, మోషన్ పోస్టర్‌ని సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే సమయానికి సూపర్ స్టార్ అభిమానులకు ఫస్ట్ లుక్ తో మంచి ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో రజినీకాంత్ సాంప్రదాయ దుస్తులు ధరించి, యంగ్ లుక్ లో చాలా ఉత్సాహంగా కన్పిస్తున్నారు. ఈ లుక్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం 2021 నవంబర్ 4న వెండి తెరపైకి రాబోతున్నట్లు ఇంతకుముందు ప్రకటించారు.

Image

Related Articles

Latest Articles

-Advertisement-