Bigg Boss 9 : బిగ్ బాస్ లో రోజురోజుకూ పిచ్చి పనులు మరీ ఎక్కువ అయిపోతున్నాయి. టాస్కుల పేరుతో చిన్న, పెద్ద అనేది చూడకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. కొన్ని సార్లు నెట్టేసుకోవడం, కొట్టుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు. చూసే వాళ్లకు ఎంత చిరాకు లేసినా.. చూడక తప్పదనుకోండి. అదే బిగ్ బాస్ మాయ. ఇక తాజాగా కామనర్స్ కు, సెలబ్రిటీలకు కలిసి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. వాళ్ల ముందు ఓ చక్రాన్ని పెట్టాడు. అది తిరుగుతూ ఉంటుంది. రెండు టీమ్స్ నుంచి ఒక్కొక్కరు వచ్చి ఒక చేతితో దాన్ని పట్టుకోవాలి. ఈ చక్రం తిరుగుతున్న టైమ్ లో బిగ్ బాస్ వాళ్లకు కొన్ని టాస్కులు ఇస్తాడు. అది కంప్లీట్ చేసిన వారికి ఒక గంట టైమ్ పెరుగుతుంది.
Read Also : Kalki-2 : దీపిక ప్లేస్ లో సూట్ అయ్యేది ఆ ఇద్దరేనా..?
చక్రం ఆగిపోయే టైమ్ లో ఏ టీమ్ కు ఎక్కువ టైమ్ ఉంటే వారే విన్నర్. అయితే ఈ చక్రాన్ని పట్టుకున్న వారిలో ఎవరినైనా ఈజీగా తప్పించొచ్చు. అవతలి టీమ్ వాళ్లను తప్పించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే దీన్నే కామనర్ డిమాన్ పవన్ అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. ఈ గేమ్ లో సుమన్ శెట్టి చివరి దాకా బాగా ఆడాడు. కానీ చివర్లో డిమాన్ పవన్ సుమన్ ను మెడ పట్టుకుని లాగేశాడు. అయినా సుమన్ కింద పడలేదు. దీంతో కాలు పట్టుకుని లాగి పడేశాడు పవన్. దీంతో సుమన్ పల్టీలు కొడుతూ దారుణంగా కింద పడ్డాడు. ఇది చూసిన ప్రేక్షకులు పవన్ మీద దుమ్మెత్తి పోస్తున్నాడు. ఆడటం చేతకాక.. వయసులో పెద్దోడు అని కూడా చూడకుండా కింద పడేస్తాడా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
Read Also : Manchu Lakshmi : ఇటు మిరాయ్.. అటు ఓజీ.. మంచు లక్ష్మీ రిస్క్..
