Vasanthi Krishnan: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో వాసంతి కృష్ణన్ తన అందచందాలతో పాపులారిటీ సంపాదించుకుంది. అయితే బిగ్‌బాస్‌కు ముందు వాసంతి ఓ సీరియల్‌తో పాటు రెండు చిన్న సినిమాలలో నటించింది. సంపూర్ణేష్‌తో కలిసి ఓ మూవీలో నటించింది. కానీ అనుకున్న స్థాయిలో మాత్రం గుర్తింపు రాలేదు. ఊహించని విధంగా బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. హౌస్‌లో వాసంతి కాంట్రవర్సీలకు దూరంగా ఉండేది. ఎక్కువగా కీర్తి, ఇనయా, మెరీనాలతో స్నేహంగా మెలిగేది. పెద్దగా గేమ్ ఆడకపోయినా ఆరు వారాల పాటు కొనసాగింది.
బిగ్‌బాస్ షోతో తనకు వచ్చిన పాపులారిటీ ఉపయోగించుకుని సినిమాలలో ఆఫర్స్ సొంతం చేసుకోవాలని వాసంతి భావిస్తుంది. త్వరలోనే తన కెరీర్ వేగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌పై తన అభిమానాన్ని చెప్పుకొచ్చింది. పవర్ స్టార్‌తో సినిమాలో ఛాన్స్ వస్తే ఏం ఆలోచించకుండా ఓకే చెప్పేస్తానని వాసంతి చెప్పింది.
Read Also: Actress Passes Away : సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
అయితే తన ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉందని వాసంతి వివరించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ టిక్కెట్ కేటాయిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వదులుకోనని వాసంతి వెల్లడించింది. గతంలో తన తండ్రి ప్రజారాజ్యం పార్టీలో లీడర్‌గా ఉండేవారని, ఇప్పుడు జనసేన మద్దతుదారుడిగా ఉన్నారని చెప్పింది. రాజకీయాలపై తనకు ఆసక్తి ఉందని.. అందుకే జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. కాగా వాసంతిని జనసేన పార్టీ అసలు లెక్కలోకి తీసుకుంటుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.