Site icon NTV Telugu

Bigg Boss 9 : రీతూ చౌదరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. తనూజ అతనితో.. అరేయ్ ఏంట్రా ఇది..

Bigg Boss 9

Bigg Boss 9

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తోంది. ఈ సీజన్ లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటున్నారు. అయితే బిగ్ బాస్ లో లవ్ స్టోరీలు చాలా కామన్ అనే విషయం మనకు తెలిసిందే. అది లేకపోతే అసలు బిగ్ బాస్ కు క్రేజ్ ఎక్కడి నుంచి వస్తుంది కదా.. అందుకే ఈ సారి సీజన్-9లో చాలానే లవ్ ట్రాక్ లు కనిపిస్తున్నాయి. అసలు ఎవరు ఎవరితో లవ్ ట్రాక్ లు నడిపిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. రీతూ చౌదరి అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తూ.. డీజే టిల్లు సినిమాలో రాధికకు కంటే డేంజర్ పోరిలా తయారైంది. మొదట్లో జవాన్ పవన్ కల్యాణ్‌ తో రొమాంటిక్ ట్రాక్ నడిపింది. మధ్యలో డిమాన్ పవన్ ను కూడా వలలో వేసుకుంది.

Read Also : Little Hearts Jai Krishna : టాలీవుడ్ కు కొత్త కమెడియన్ వచ్చాడోచ్..

ఇద్దరికీ పులిహోర కలుపుతూ రచ్చ లేపుతోంది. నువ్వు వద్దన్నా నిన్నే చూడాలనిపిస్తోంది అంటూ పవన్ కల్యాణ్‌ కు బిస్కెట్లు వేస్తోంది. అటు డిమాన్ పవన్ వద్దకు వెళ్లి.. నువ్వు చాలా క్యూట్ గా ఉంటావ్.. అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అంటూ క్రీమ్ బిస్కెట్లు వేసింది. ఇంకేముంది ఇద్దరు కుర్రాళ్లు ఈ పిల్ల మాటలకు గింగిరాలు తిరిగిపోతున్నారు. మరీ దారుణం ఏంటంటే.. వీరు ముగ్గురూ ఒకే దగ్గర ఉంటూ ఇలాంటివి మాట్లాడేసుకుంటున్నారు. ఇద్దరు పవన్ లకు ఈ విషయం తెలిసి కూడా రీతూతో రాసుకుని తిరుగుతున్నారు. మరి ఇందులో ఎవరు బకరా అవుతారో తెలియాలి. ఇక అటు ఇమ్మాన్యుయెల్ అయితే తనూజ వెంట పడుతున్నాడు. తనూజ కూడా ఇమ్మాన్యుయెల్ మాటలకు తెగ ఫీల్ అయిపోతోంది. ఇద్దరూ కామెడీగా మాట్లాడుకుంటూ కొంత ఎంటర్ టైన్ చేస్తున్నారు. అదే టైమ్ లో కామెడీ లవ్ ట్రాక్ ఎక్కుతున్నారు. అసలే బిగ్ బాస్ కు ఇలాంటివి బాగా ఇష్టం కదా. అందుకే వీళ్ల ట్రాక్ లకు బీజీఎంలు వేస్తూ ప్రోమోలు వేస్తున్నాడు. మరి ఈ లవ్ ట్రాక్ లతో ఈ సీజన్ ఆపుతాడా.. లేదంటే కొత్త ట్రాక్ లు క్రియేట్ చేస్తాడా.. అంతా బిగ్ బాస్ మాయ.

Read Also : Ravali : ఈ స్టార్ హీరోయిన్ ను గుర్తు పట్టారా.. ఇలా మారిందేంటి..?

Exit mobile version