Bigg Boss 9 : రెడ్ ఫ్లవర్ నుంచి ఎగ్ గొడవ వరకు.. బిగ్ బాస్ 9 నామినేషన్స్ హైలెట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ సీజన్ 9 రెండో వారం నామినేషన్ ఎపిసోడ్ పూర్తిగా ఎమోషన్స్, ఘర్షణలు, ఫన్నీ మూమెంట్స్‌తో నిండిపోయింది. ప్రతి వారం లాగే ఈసారి కూడా కంటెస్టెంట్స్ మధ్య వేడెక్కిన చర్చలు, ఆరోపణలు, కౌంటర్లు ప్రేక్షకులకు ఆసక్తికరంగా అనిపించాయి. ముఖ్యంగా “రెడ్ ఫ్లవర్ ఇష్యూ” “ఎగ్ గొడవ” ఈ వారం నామినేషన్స్‌లో హాట్ టాపిక్స్‌గా మారాయి. మంగళవారం ఎపిసోడ్లో రాము రాథోడ్, కళ్యాణ్ యాటిట్యూడ్ నచ్చలేదని నామినేట్ చేయగా, కళ్యాణ్ “ట్రోల్ అవుతావ్” అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ తారా స్థాయికి చేరింది. రీతూ చౌదరి హరీష్‌ను “మిస్టేక్స్ ఒప్పుకొని గివప్ ఇస్తున్నావు” అంటూ నామినేట్ చేయగా, హరీష్ ఆమెను “సింపతీ గేమ్ ఆడుతున్నావు” అంటూ ఎదిరించాడు. ఈ ఇద్దరి మధ్యన జరిగిన వాగ్వాదం హౌస్ మొత్తాన్ని షాక్‌కు గురి చేసింది.
Also Read : Prabhas : ప్రభాస్, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్..!
Also Read
- NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
- Drishyam 3 Hindi Version : 'దృశ్యం 3' హిందీ వెర్షన్ లో భారీ మార్పులు... రీజన్ ఇదేనా ?
- Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి... చేసేదంతా దర్శకులే... 'పెద్ది' వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
- NTRNEEL : ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
ప్రియా ఫ్లోరాను “షాంపూ ఇష్యూ”పై, భరణిని “ఎగ్ గొడవ” కారణంగా నామినేట్ చేసింది. ఇమ్మాన్యుయెల్, పవన్ కళ్యాణ్, సుమన్ శెట్టి, కళ్యాణ్ కూడా తమ నామినేషన్స్‌లో రకరకాల రీజన్స్ చెబుతూ హౌస్‌లో వాతావరణాన్ని టెన్షన్‌తో నింపారు. ముఖ్యంగా హరీష్‌పై ఎక్కువ మంది కంటెస్టెంట్స్ టార్గెట్ చేయడం గమనార్హం. చివరికి నామినేట్ అయిన వారు: భరణి, హరీష్, పవన్ కళ్యాణ్, ప్రియా, ఫ్లోరా సైనీ, మనీష్, సుమన్ శెట్టి. అయితే కెప్టెన్ సంజనకు బిగ్ బాస్ ప్రత్యేక అధికారం ఇచ్చి, ఒకరిని నేరుగా నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. దాంతో ఆమె సుమన్ శెట్టినే డైరెక్ట్‌గా నామినేట్ చేసింది.
మొత్తానికి రెండో వారం నామినేషన్స్ పూర్తిగా హౌస్‌ను వేడెక్కించాయి. ఫుడ్, గేమ్ టాస్కులు, చిన్న చిన్న అపార్థాల నుంచి పెద్ద పెద్ద గొడవలు రావడం ఈ సీజన్ డ్రామాను మరింత ఆసక్తికరంగా మార్చింది. ఇక ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది వచ్చే ఎపిసోడ్ వరకు సస్పెన్స్‌గానే మిగిలింది.
తాజావార్తలు
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్‌పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!