Site icon NTV Telugu

Bigg Boss 9 : రెడ్ ఫ్లవర్ నుంచి ఎగ్ గొడవ వరకు.. బిగ్ బాస్ 9 నామినేషన్స్ హైలెట్స్

Bigg Boss9

Bigg Boss9

బిగ్ బాస్ సీజన్ 9 రెండో వారం నామినేషన్ ఎపిసోడ్ పూర్తిగా ఎమోషన్స్, ఘర్షణలు, ఫన్నీ మూమెంట్స్‌తో నిండిపోయింది. ప్రతి వారం లాగే ఈసారి కూడా కంటెస్టెంట్స్ మధ్య వేడెక్కిన చర్చలు, ఆరోపణలు, కౌంటర్లు ప్రేక్షకులకు ఆసక్తికరంగా అనిపించాయి. ముఖ్యంగా “రెడ్ ఫ్లవర్ ఇష్యూ” “ఎగ్ గొడవ” ఈ వారం నామినేషన్స్‌లో హాట్ టాపిక్స్‌గా మారాయి. మంగళవారం ఎపిసోడ్‌లో రాము రాథోడ్, కళ్యాణ్ యాటిట్యూడ్ నచ్చలేదని నామినేట్ చేయగా, కళ్యాణ్ “ట్రోల్ అవుతావ్” అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ తారా స్థాయికి చేరింది. రీతూ చౌదరి హరీష్‌ను “మిస్టేక్స్ ఒప్పుకొని గివప్ ఇస్తున్నావు” అంటూ నామినేట్ చేయగా, హరీష్ ఆమెను “సింపతీ గేమ్ ఆడుతున్నావు” అంటూ ఎదిరించాడు. ఈ ఇద్దరి మధ్యన జరిగిన వాగ్వాదం హౌస్ మొత్తాన్ని షాక్‌కు గురి చేసింది.

Also Read : Prabhas : ప్రభాస్, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్‌డేట్..!

ప్రియా ఫ్లోరాను “షాంపూ ఇష్యూ”పై, భరణిని “ఎగ్ గొడవ” కారణంగా నామినేట్ చేసింది. ఇమ్మాన్యుయెల్, పవన్ కళ్యాణ్, సుమన్ శెట్టి, కళ్యాణ్ కూడా తమ నామినేషన్స్‌లో రకరకాల రీజన్స్ చెబుతూ హౌస్‌లో వాతావరణాన్ని టెన్షన్‌తో నింపారు. ముఖ్యంగా హరీష్‌పై ఎక్కువ మంది కంటెస్టెంట్స్ టార్గెట్ చేయడం గమనార్హం. చివరికి నామినేట్ అయిన వారు: భరణి, హరీష్, పవన్ కళ్యాణ్, ప్రియా, ఫ్లోరా సైనీ, మనీష్, సుమన్ శెట్టి. అయితే కెప్టెన్ సంజనకు బిగ్ బాస్ ప్రత్యేక అధికారం ఇచ్చి, ఒకరిని నేరుగా నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. దాంతో ఆమె సుమన్ శెట్టినే డైరెక్ట్‌గా నామినేట్ చేసింది.

మొత్తానికి రెండో వారం నామినేషన్స్ పూర్తిగా హౌస్‌ను వేడెక్కించాయి. ఫుడ్, గేమ్ టాస్కులు, చిన్న చిన్న అపార్థాల నుంచి పెద్ద పెద్ద గొడవలు రావడం ఈ సీజన్ డ్రామాను మరింత ఆసక్తికరంగా మార్చింది. ఇక ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది వచ్చే ఎపిసోడ్ వరకు సస్పెన్స్‌గానే మిగిలింది.

Exit mobile version