Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9లో రకరకాల ట్విస్టులు జరుగుతున్నాయి. నిన్న మాధురి ఎలిమినేట్ అయిపోయింది. ఇక సోమవారం నామినేషన్స్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో తండ్రి, కూతుర్లుగా చెప్పుకునే భరణి, తనూజలు గొడవ పడ్డారు. ముందు ఇమ్మాన్యుయెల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని తనూజ ఫైర్ అయింది. తన వల్ల అయినంత వరకే అందరికీ సపోర్టు చేస్తానని తెలిపాడు. అలాంటప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావ్.. మధ్యలో ఎందుకు వదిలేస్తున్నావ్.. నీ స్వార్థం చూసుకుంటున్నావా అని తనూజ ఫైర్ అయింది. ఇక ఇదే నామినేషన్స్ లో తనూజపై భరణి కోపానికి వచ్చాడు. తనూజ తనను ఒక్క టాస్క్ లో కూడా సేవ్ చేయట్లేదని తెలిపాడు.
Read Also : SSMB 29 : మహేశ్ మూవీకి టైటిల్ ఇష్యూ.. రాజమౌళికి ఏం చేస్తాడో..?
తనూజను నేను రెండు టాస్క్ లలో సేవ్ చేశాను. కానీ తనూజ నన్ను పట్టించుకోలేదు. ఆమె సెల్ఫిష్ నెస్ చూసుకుంటోంది. ఆమె ఇంట్లో ఉండటానికి అర్హురాలు కాదు. తాను ఏ బంధం కోసం అయితే బయటకు వెళ్లానో.. తనూజ కూడా ఒకసారి బయటకు వెళ్లి వస్తే ఆమెకే అర్థం అవుతుందన్నాడు భరణి. దీంతో తనూజ కూడా సీరియస్ అయింది. ఆ రెండు టాస్కులు సపోర్టింగ్ గేమ్స్ కాబట్టి సేవ్ చేశావని తెలిపింది తనూజ. మాటి మాటికీ మధ్యలో ఇమ్మాన్యుయెల్, దివ్య వచ్చి మాట్లాడుతుంటే తనకు స్పేస్ దొరకట్లేదని తెలిపింది. పర్సనల్ ఏమైనా ఉంటే ఇంట్లో పెట్టుకోవాలన్నది. తనూజ కూడా బయటకు వెళ్లాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పాడు భరణి.
Read Also : Devi Sri Prasad : మొత్తానికి తన పెళ్లి విషయంలో రియాక్ట్ అయిన దేవిశ్రీ ప్రసాద్..
