Bigg boss 6 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది అంటే అతిశయోక్తి కాదు. కంటెస్టెంట్ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ముఖ్యంగా ఎలిమినేషన్ సమయంలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకొంటున్నాయి. ఒకరి మీద ఒకరు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. ఇక టాస్కుల్లో కొంతమంది గ్రూపులుగా మారి ఆడుతుంటే.. మరికొందరు సింగిల్ గా నెట్టుకొస్తున్నారు. ఇక ముందు నుంచి వర్మ హీరోయిన్ ఇనయా సుల్తానా అంటే హౌస్ లో ఎవరికి గిట్టడం లేదు. మొన్నటివరకు గీతూతో గొడవ పెట్టుకున్న ఈ భామ ఇప్పుడు టాస్క్ లో నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేసి హౌస్ మేట్స్ కోపానికి బలి అవుతోంది. తాజాగా మరోసారి ఇనయా నోరు జారింది. తాజాగా హౌస్ లో అడవిలో ఆట అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.. ఇందులో కొందరు పోలీసులుగా.. మరికొందరు దొంగలుగా కనిపించారు. దొంగలను దొంగతనం చేయకుండా పోలీసులు అడ్డుకోవాలి. పోలీసుల కంట పడకుండా దొంగతనం చేయాలి దొంగలు.
ఇక ఈ ఆటలో ఆరోహికి గాయాలయ్యాయి. దీంతో ఆమెను గేమ్ నుంచి కొద్దిగా పక్కకు తప్పించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీస్ గా వ్యవహరిస్తున్న ఇనయా మిగతావారిపై అరవడం మొదలుపెట్టింది.. నొప్పి ఉందని, అది ఉందని వారిని ఎలా గేమ్ నుంచి తప్పిస్తారంటూ వాగ్వాదానికి దిగింది. ఇక దీనికి సత్య సైతం సపోర్ట్ చేస్తూ ఆమెకు లెగ్ పెయిన్ ఉంది అనగానే.. దానికి కారణం శ్రీహన్ అని చూపిస్తూ ” అది లాగింది వాడు” అంటూ అనడంతో శ్రీహన్ కు కోపం నషాళానికి ఎక్కింది.. నోరు అదుపులో పెట్టుకో.. వాడు వీడు ఏంటి అంటూ విరుచుకుపడ్డాడు. ఇక రేవంత్ సైతం శ్రీహన్ కు సపోర్ట్ చేస్తూ.. మొన్న తనను కూడా వాడు అని అన్నదని, ఆ సమయంలోనే చెంప పగలుకొట్టి ఉంటే బావుండేదని చెప్పుకొచ్చాడు. దీంతో రెచ్చిపోయిన ఇనయా.. నన్ను కొడతాను అనడానికి నువ్వు ఎవరు అంటూ హౌస్ లోగట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టింది. అందుకు రేవంత్.. మీ ఇంట్లో నీకు సంస్కారం నేర్పలేదా అంటూ గొడవ పడ్డాడు. ఇందుకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. వీరి గొడవ చూస్తుంటే నాగ్ వచ్చేలోపే కొట్టుకొనేలా ఉన్నారు. మరీ ఈ గొడవపైన నాగ్ ఏమంటాడో చూడాలి.
