బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ గా విజె సన్నీ గెలిచిన విషయం తెలిసిందే. ట్రోఫీ గెలిచి బయటికి వచ్చిన దగ్గరనుంచి సన్నీ పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చే పనిలో ఉన్నాడు. ఇక నిన్న హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్ లో మీడియా ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు పాల్గొన్నాయి. ఇక ఈ కార్యక్రమంలో చిన్న అపశృతి దొర్లింది. సన్నీ చేతికి కరెంట్ షాక్ తగిలింది.
సన్నీ మాట్లాడుతూ ఫోన్ లో ఒక క్లిప్పింగ్ చూపించడానికి ఫోన్ పట్టుకోగా.. అది సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి ఉండడంతో కొద్దిగా షాక్ కొట్టింది. దీంతో వెంటనే సన్నీ చేతిని వెనక్కి లాగేశాడు. ఈ ఘటనలో ఎవరికి హానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది చిన్నపాటి సంఘటనే అయినా సన్నీ ఫ్యాన్స్ ఈ వీడియోని నెట్టింట వైరల్ గా మార్చేశారు. ఇక ఈ వీడియో చూసిన వారు జాగ్రత్త సన్నీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
