జస్వంత్ పడాల తాజా “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5″తో పాపులర్ అయ్యాడన్న విషయం తెలిసిందే. హౌజ్ లో ఆయన వైఖరి, అమాయకత్వంతో బయట భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. జెస్సి తన డాషింగ్ లుక్స్‌తో భారీ మహిళా ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు. అయితే అనారోగ్య కారణాలతో రియాల్టీ షో నుంచి జెస్సీ తప్పుకోవాల్సి వచ్చింది. ఆ వెంటనే తనకు మూవీ ఆఫర్ వచ్చిందని ‘బిగ్ బాస్ 5’ ఫైనల్ లో జెస్సి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు జశ్వంత్ మూవీ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “నా మొదటి సినిమా పోస్టర్ ‘ఎర్రర్ 500’. మీ ఆశీస్సులు కావాలి. మీ ప్రేమ, సపోర్ట్ తో నేను దీన్ని ప్రారంభించాను. భవిష్యత్తులో మిమ్మల్ని మరింతగా అలరిస్తాను” అని జెస్సీ క్యాప్షన్ ఇచ్చారు. “ఎర్రర్ 500” పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి సందీప్ మైత్రేయ దర్శకత్వం వహించగా, మైత్రేయ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
జెస్సీ విషయానికొస్తే… 29 ఏళ్ల ఈ మోడల్ బెంగళూరులో ఒక చిన్న ప్రదర్శనతో మోడలింగ్ ప్రారంభించాడు. తరువాత Mr AP ట్రెడిషనల్ ఐకాన్ 2017, మోడల్ హంట్ సీజన్ 2 విజేత, మోస్ట్ పాపులర్ సూపర్ మోడల్ ఇండియా 2018 వంటి అనేక అవార్డులను గెలుచుకున్నాడు. 2019లో జెస్సి డ్రీమ్ జోన్ స్కూల్ ఆఫ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం ఒకే ఫ్యాషన్ షోలో 200ల కంటే ఎక్కువ మోడళ్లకు కొరియోగ్రఫీ చేసాడు.
