Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మికకు పాపం ఎవరికి రాని కష్టం వచ్చి పడింది. ఎంతో ఆశతో ఒప్పుకున్నా ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఇదంతా విజయ్ దేవరకొండ వలనే అని టాక్ నడుస్తోంది. అవునా.. నిజామా అసలేమైంది అంటే.. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ అవ్వడానికి బాగానే ప్రయత్నాలు చేసింది. పుష్ప సినిమాతో అమ్మడు ఒక్కసారిగా హిందీ జనాలకు ఫేవరేట్ గా మారిపోయింది. ఇక దీంతో బావు లో వరుస అవకాశాలు తలుపుతట్టాయి. సిద్దార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను, అమితాబ్ బచ్చన్ తో కలిసి గుడ్ బై, రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాల్లో నటిస్తోంది. ఇక ఇవి కాకుండా టైగర్ ష్రాఫ్ తో ఒక సినిమాకు సైన్ చేసింది. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నదని ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే లైగర్ సినిమా రిలీజ్ అవ్వడం, ప్లాప్ అవ్వడంతో కరణ్ జోహార్ కొద్దిగా నష్టాలను చవిచూశాడ. కొద్దిగా అని చెప్పలేం కానీ కొన్ని కోట్లలలోనే నష్టపోయాడు.
ఇక ఈ నష్టాలను పూడ్చుకోవడానికి టైగర్ ష్రాఫ్ ను రెమ్యూనిరేషన్ తగ్గించుకోమని అడిగాడట కరణ్.. దానికి బదులు లాభల్లో వాటా తీసుకోమని చెప్పాడట. అయితే అందుకు టైగర్ ఒప్పుకోలేదని టాక్. దానికి కూడా కారణం లేకపోలేదు. ప్రస్తుతం బాలీవుడ్ బడ్జెట్ సినిమాలు ఏది హిట్ అవుతుందో, ఏది ప్లాప్ అవుతుందో చెప్పడం కష్టం. రిస్క్ ఎందుకు.. మన పారితోషికం మనం తీసుకుని బయటికి వెళ్తే సరిపోతుందని అనుకున్నాడట టైగర్ ష్రాఫ్. ముందు అనుకున్నట్టుగానే రూ. 35 కోట్లు పారితోషికం ఇస్తేనే సినిమా చేస్తానని చెప్పాడట. దీంతో అంత ఇవ్వలేని కరణ్ ఈ సినిమాను క్యాన్సిల్ చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది. వీరిద్దరి గొడవతో పాపం రష్మిక అన్యాయమైపోయింది అని అంటున్నారు అభిమానులు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
