Site icon NTV Telugu

Tollywood : సమ్మర్ ను వదిలేసిన స్టార్ హీరోలు..

Tollywood

Tollywood

Tollywood : టాలీవుడ్ లో దాదాపు పెద్ద సినిమాలు అన్నీ సమ్మర్ కే వస్తుంటాయి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ చాలా పెద్ద సీజన్. స్టూడెంట్స్, ఎంప్లాయిస్ అందరూ ఖాళీగానే ఉంటారు కాబట్టి ఈ సీజన్ లో సినిమాలు యావరేజ్ టాక్ వచ్చినా వసూళ్లు గ్యారెంటీ. కానీ ఈ సారి పెద్ద స్టార్లు అందరూ సమ్మర్ ను వదిలేసి స్కూల్స్ స్టార్ట్ అయ్యే సీజన్ కు వస్తున్నారు. పవన్ కల్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు మూవీ వాస్తవానికి మే 9న వస్తుందని అంతా అనుకున్నారు. కానీ పోస్ట్ పోన్ అయి జూన్ 12న వస్తోంది. అప్పటికి స్కూల్స్ ప్రారంభం అయిపోతాయి.

Read Also : Naveen Polishetty : మణిరత్నంతో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ యంగ్ హీరో..

అటు విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీని మే 30న రిలీజ్ చేస్తామని ముందే ప్రకటించారు. కానీ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జులై 4న రిలీజ్ చేస్తామన్నారు. నాగార్జున, ధనుష్ నటించిన కుబేర మూవీని మే నెలలో రిలీజ్ చేయాలని అనుకుని చివరకు జూన్ లోనే రిలీజ్ చేస్తున్నారు. కన్నప్ప మూవీని ఏప్రిల్ లో రిలీజ్ డేట్ ప్రకటించి.. మళ్లీ జూన్ 27కు వాయిదా వేశారు. ది రాజాసాబ్ మూవీ కూడా షూటింగ్ అయిపోయినా సరే సమ్మర్ కు రిలీజ్ చేయట్లేదు. అది సెప్టెంబర్ లో ప్లాన్ చేస్తున్నారు.

రజినీకాంత్ కూలీ, ఎన్టీఆర్- హృతిక్ రోషన్ వార్-2 సినిమాలు కూడా ఆగస్టుకు వాయిదా వేసేశారు.. ఈ సమ్మర్ కు ఒక్క నాని నటించిన హిట్-3 తప్ప.. చెప్పుకోదగ్గ పెద్ద మూవీలు ఒక్కటి కూడా రాలేదు. పండగ సీజన్లకు పెద్ద సినిమాలను రిలీజ్ చేస్తున్నారు గానీ.. సమ్మర్ సీజన్లకు మాత్రం రావట్లేదు. మరి రాను రాను ఇదే కంటిన్యూ అవుతుందా లేదా చూడాలి.

Read Also : Cyber Fraud : సీఎం ఓఎస్డీ పేరుతో సైబర్ వల.. వ్యాపారులకు ఉచ్చు..!

Exit mobile version