Site icon NTV Telugu

డిసెంబర్ లో సందడి మామూలుగా లేదు…!

allu-arjun

allu-arjun

కరోనా సెకండ్ వేవ్ తర్వాత అన్ని రాష్ట్రాలలోనూ పూర్తి స్థాయిలో థియేటర్లు తెరచుకోలేదు. తమిళనాడు లాంటి చోట్ల 23 నుండి యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరచుకున్నాయి. ఏపీలోనూ యాభై శాతం ఆక్యుపెన్సీతోనే ఇప్పటికీ నడుస్తున్నాయి. అదీ రోజుకు మూడు ఆటలతోనే! చిత్రం ఏమంటే… జనాలను థియేటర్లకు తీసుకొచ్చే మాస్ హీరో సినిమా ఏదీ ఇంతవరకూ విడుదల కాకపోవడంతో తెలంగాణాలో నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చినా… చాలా థియేటర్లు ఇంకా తెరచుకోలేదు. జంట థియేటర్లు ఉన్న చోట కూడా ఒకటి మాత్రమే తెరిచి, ఉన్న సినిమాలనే రెండు రెండు ఆటల చొప్పున ప్రదర్శిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ యేడాది డిసెంబర్ నాటికి పరిస్థితులు చక్కబడతాయని భావిస్తున్న ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ ఆ నెలలో సినిమాల విడుదలకు సంబంధించి రిలీజ్ డేట్స్ ను ఇప్పటికే ప్రకటించేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ డిసెంబర్ చివరి వారంలో క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతోంది. అదే సమయంలో ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ కూడా జనం ముందుకు రాబోతోంది. ఈ మూవీతో అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఇక డిసెంబర్ 3న విడుదల కాబోతున్న ‘తడప్’ మూవీ తెలుగులో వచ్చిన ‘ఆర్. ఎక్స్. 100’కు రీమేక్. ఈ మూవీతో సునీల్ శెట్టి కుమారుడు ఆహన్ శెట్టి తెరంగేట్రమ్ చేస్తున్నాడు. అలానే సోనీ సంస్థ ‘స్పైడర్ మాన్ : నో వే హోమ్’ను ఇండియాలో డిసెంబర్ 17న గ్రాండ్ వేలో రిలీజ్ చేయబోతోంది. ఇంగ్లీష్ తో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇలా జాతీయ, అంతర్జాతీయ చిత్రాలు చాలా వరకూ డిసెంబర్ నెలను నమ్ముకుని రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. మరి అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

Exit mobile version