కరోనా సెకండ్ వేవ్ తర్వాత అన్ని రాష్ట్రాలలోనూ పూర్తి స్థాయిలో థియేటర్లు తెరచుకోలేదు. తమిళనాడు లాంటి చోట్ల 23 నుండి యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరచుకున్నాయి. ఏపీలోనూ యాభై శాతం ఆక్యుపెన్సీతోనే ఇప్పటికీ నడుస్తున్నాయి. అదీ రోజుకు మూడు ఆటలతోనే! చిత్రం ఏమంటే… జనాలను థియేటర్లకు తీసుకొచ్చే మాస్ హీరో సినిమా ఏదీ ఇంతవరకూ విడుదల కాకపోవడంతో తెలంగాణాలో నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చినా… చాలా థియేటర్లు ఇంకా తెరచుకోలేదు. జంట థియేటర్లు ఉన్న…