NTV Telugu Site icon

Vijay Antony: కోలీవుడ్ హీరో విజయ్ విడాకులు..?

Vijay

Vijay

Vijay Antony: బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో విజయ్ ఆంటోనీ. ఈ సినిమా తరువాత తన సినిమాలన్నింటినీ తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాడు విజయ్. ఇక తాజాగా ఆయన నటించిన చిత్రం హత్య. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక విజయ్ సోషల్ మీడియా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాడు. తన సినిమాలు గురించి తప్ప ఇతర విషయాల గురించి ఎప్పుడు ట్వీట్ చేయని ఈ హీరో తాజాగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టుకొచ్చాడు. కుటుంబంలో విబేధాలు వస్తే పరిష్కరించుకోవాలి కానీ మూడో వ్యక్తిని దగ్గరకు రానీయవద్దని సలహా ఇచ్చాడు.

” మీ కుటుంబంలో సమస్యలు వస్తే మీరే పరిష్కరించుకోండి.. ఒకవేళ ఇద్దరూ పరిష్కరించుకోలేకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోయి విడివిడిగా బతుకుతూ జీవించండి. అంతేకానీ మధ్యలోకి మూడో వ్యక్తిని పిలవకండి. వారు మిమ్మల్ని నాశనం చేయడానికి వచ్చి మీ నాశనాన్ని చూసి ఆనందిస్తారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ వ్యాఖ్యలు అందరిలోనూ అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి. విజయ్, తన భార్య ఫాతిమాకు మధ్య ఏమైనా విబేధాలు తలెత్తాయా..? వారు విడిపోవాలనుకున్నప్పుడు మధ్యలో వచ్చిన మూడో వ్యక్తి ఎవరు..? త్వరలో ఈ జంట విడాకులు అని బాంబ్ పేల్చదు కదా ..? అని రకరకాలుగా నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి విజయ్ ఈ ట్వీట్ దేని గురించి పెట్టాడో తెలియాలంటే అతనే నోరు విప్పాలి.

Show comments