Site icon NTV Telugu

Bichagadu 2: ‘బిచ్చగాడు2’ ఫస్టాఫ్ లేపేశారు! అలా ఎలా మావా?

Bichhagadu 2

Bichhagadu 2

ప్రస్తుతం టాలీవుడ్‌ బాక్సాఫీస్ దగ్గర బిచ్చగాడు 2 హవా నడుస్తోంది. ఈ సినిమా ఊహించని వసూళ్లను రాబడుతోంది. తెలుగు మీడియం రేంజ్ సినిమాలకు మించి కలెక్షన్స్ సాధిస్తోంది. సినిమా టైటిల్ బిచ్చగాడునే కానీ.. డిస్ట్రిబ్యూటర్స్‌ని ఈ సినిమా శ్రీమంతులని చేస్తోంది. అన్నీ తానై మరోసారి బిచ్చగాడుగా ఆడియెన్స్ ముందుకు వచ్చిన విజయ్ ఆంటోనికి భారీ విజయాన్ని ఇచ్చేశారు తెలుగు జనాలు. అయితే ఈ సినిమా విషయంలో ఓ ఊహించని సంఘటన జరిగింది. ఏకంగా ఈ సినిమా ఫస్టాఫ్‌ని లేపేసి షో ప్రదర్శించారనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే మరో విచిత్రం ఏంటంటే.. సెకండాఫ్ మొత్తం అయిపోయే వరకు గానీ ఆడియెన్స్‌కు అసలు మ్యాటర్ అర్థం కాలేదట. మామూలుగా ఏదైనా సినిమాకు లేట్‌గా వెళ్లినప్పుడు.. అరె స్టార్టింగ్‌ మిస్ అయ్యామని ఫీల్ అవుతుంటాం. కానీ షో స్టార్ట్ అవడమే సెకండాఫ్‌తో మొదలైతే.. ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

బిచ్చగాడు2 విషయంలో ఇదే జరిగింది. హైదరాబాద్‌లోని ఓ మల్టీప్లెక్స్‌లో సెకండ్ హాఫ్ నుంచి స్క్రీనింగ్ వేసారట. అయినా కూడా మనోళ్లు పాప్‌కార్న్ తింటూ పస్టాఫ్ రేంజ్‌లో సెకండాఫ్ మొత్తం చూసేసారట. కానీ చివరకు ఎండ్ కార్డు చూసి అంతా షాక్ అయ్యారట. దీంతో తమకు పూర్తిగా సినిమా చూపించలేదని థియేటర్ యాజమాన్యంపై ఫైర్ అయ్యారనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ అవుతోంది. దీంతో ఈ ఇన్సిడెంట్‌ చాలా ఫన్నీ అండ్ షాకింగ్‌గా మారింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. ఇది సెకండాఫ్ అని తెలియకుండానే ఆడియెన్స్ సినిమాను ఎంజాయ్ చేశారంటే.. బిచ్చగాడు2 ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Exit mobile version