Site icon NTV Telugu

Bhumika Chawla: నమ్మించి హ్యాండ్ ఇచ్చారు.. చాలా బాధేసింది

Bhumika Losing Projects

Bhumika Losing Projects

Bhumika Chawla Broke Silence On Getting Replaced From Big Films: సినీ పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టిన వాళ్లకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. మరీ ముఖ్యంగా.. అమ్మాయిలైతే చాలా కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. క్యాస్టింగ్ కౌచ్ అని కొందరు వేధిస్తే.. మరికొందరు సినిమాలో ఎంపిక చేసినట్టే చేసి ఆ తర్వాత తొలగిస్తుంటారు. వారి స్థానంలో మరొకరిని తీసుకుంటారు. తనని కూడా అలాగే రెండు సినిమాల నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించారంటూ.. భూమికా చావ్లా చెప్పుకొచ్చింది. కిసీ కా భాయ్, కిసీ కా జాన్ సినిమాలో నటించిన ఈ అమ్మడు.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన బ్యాడ్ ఎక్స్‌పీరియెన్సెస్ గురించి చెప్పుకొచ్చింది.

Tollywood: నిర్మాతను మించిన నటుడు ఎవరూ వుండరు: బెక్కెం వేణుగోపాల్

‘‘నేను హిందీలో చేసిన తొలి సినిమా తేరే నామ్ మంచి విజయం సాధించడంతో.. నాకు మంచి మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. తేరే నామ్ తర్వాత నాకు ఒక పెద్ద ఆఫర్ వచ్చింది. కానీ.. నిర్మాతలు మారిపోవడంతో హీరోతో పాటు నన్ను ఆ ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. టైటిల్ కూడా ఛేంజ్ చేశారు. ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే, ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదేమో! ఆ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు నేను ఏదేదో ఊహించుకున్నాను. కానీ.. ఇంకేది జరిగింది. ఆ సినిమా కోసం నేను మరే మూవీ ఒప్పుకోకుండా, ఏడాది పాటు ఎదురుచూశాను. చివరికి నాకు నిరాశే మిగిలింది. కేవలం ఇదొక్కటే కాదు.. జబ్ వీ మెట్ సినిమాకి మొదటగా నేనే సంతకం చేశాను. తొలుత నాకు జోడీగా బాబీ డియోల్‌ అన్నారు. ఆ తర్వాత షాహిద్ కపూర్‌ని తీసుకున్నారు. కట్ చేస్తే.. ఆ సినిమాలో షాహిద్ కపూర్, కరీనా కపూర్ కలిసి నటించారు. నన్ను తీసేశారు’’ అంటూ భూమికా చెప్పుకొచ్చింది.

Virat Kohli: డేంజర్ జోన్‌లో కోహ్లీ.. మళ్లీ రిపీటైతే అంతే సంగతులు!

మున్నా భాయ్ ఎంబీబీఎస్ సినిమాకు కూడా తాను సంతకం చేశానని.. ఏమైందో ఏమో తెలీదు కానీ ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా తనని తొలగించారని భూమికా పేర్కొంది. మణిరత్నం రూపొందించిన ‘కన్నతిల్‌ ముత్తమిట్టల్‌’ సినిమాలోనూ నేనే హీరోయిన్ అని చెప్పి.. చివరికి తనకు హ్యాండ్ ఇచ్చారని ఆమె తెలిపింది. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్‌లో సాగుతున్న రాజకీయాల గురించి ప్రియాంకా చోప్రా ఓపెన్ అవ్వగా.. ఒక్కొక్కరు తమ చేదు అనుభవాలను ఇలా బయటపెడుతున్నారు.

Exit mobile version