NTV Telugu Site icon

Bhoomika Vasishth: డబ్బు కోసం ఆ పాడుపని చేశా.. కానీ ఆన్‌లైన్‌లో వీడియో లీకైంది

Bhoomika Vasisht

Bhoomika Vasisht

Bhoomika Vasishth Says She Did Strip Videos For Money: కొందరి సెలెబ్రిటీల జీవితాలు తెరముందు కనిపించేంత రంగులమయంగా ఉండదు. తెరవెనుక ఎన్నో చీకటి కోణాలు దాగి ఉంటాయి. వ్యక్తిగతంగా వాళ్లు ఎన్నో కష్టనష్టాల్ని ఎదుర్కుంటుంటారు. వేధింపుల దగ్గర నుంచి ఆర్థిక సమస్యల దాకా.. చెప్పుకోలేని ఎన్నో ‘బ్లాక్ & వైట్’ కథనాలుంటాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా.. భూమిక వశిష్ట్‌ని చెప్పుకోవచ్చు. ఓ డ్యాన్స్ రియాలిటీ షోతో పాపులారిటీ గడించిన ఈ అమ్మాయి.. తనకొచ్చిన సెలెబ్రిటీ స్టేటస్‌ని మెయింటెయిన్ చేసేందుకు చాలానే ఇబ్బందులు పడింది. ఫేమ్, గ్లామర్ కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది. భారీగా అప్పులు కూడా చేసింది. తీరా.. ఆ అప్పు తీర్చేందుకు డబ్బులు లేకపోవడంతో, న్యూడ్ వీడియోలు చేయాల్సిన దుస్థితికి చేరుకుంది. మరీ దారుణమైన విషయం ఏమిటంటే.. ఎవరో దుర్మార్గులు ఆ వీడియోని ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. దాంతో తాను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఈ దీనగాధను ఓ రియాలిటీ షోలో భూమిక చెప్పుకొచ్చింది.

Adipurush: శ్రీవారి సన్నిధిలో ఆదిపురుష్ టీమ్..సెల్ఫీల కోసం ఎగబడ్డ జనాలు..

‘‘నేను డ్యాన్స్‌ రియాలిటీ షోలో పాల్గొన్న తర్వాత నాకు ఫేమ్ వచ్చింది. దాంతో.. నేను సెలబ్రిటీలాగే ఉండిపోవాలనుకున్నాను. అయితే.. సెలబ్రిటీ లైఫ్ అనేది అంత సులువు కాదు. అది డబ్బుతో కూడుకున్న పని. అయినా సరే.. ఫేమ్, గ్లామర్ కోసం నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. నలుగురిలో మంచి స్థాయిలో ఉండాలన్న ఉద్దేశంతో.. నా లైఫ్‌స్టైల్ కోసం అప్పు కూడా తీసుకున్నాను. కానీ.. ఒక దశలో నేను ఆ అప్పు తీర్చలేని స్థితికి చేరుకున్నాను. అప్పుడు నేను హద్దు దాటాల్సి వచ్చింది. డబ్బుల కోసం ఒక యాప్‌లో స్ట్రిప్ వీడియో (న్యూడ్ వీడియో) అప్‌లోడ్ చేశాను. నిజానికి.. ఆ యాప్‌లో నేను చేసిన వీడియో సీక్రెట్‌గా ఉండాలి. కానీ, ఎవరో దాన్ని ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. దాంతో నాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ దెబ్బకు నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా’’నంటూ భూమిక భావోద్వేగానికి లోనైంది. ఈమె కథ షోలో ఉన్న జడ్జీలనే కాదు.. నెటిజన్లను సైతం కలచివేసింది.

Aaliya Nawazuddin: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నవాజుద్దీన్ భార్య.. మరో వ్యక్తితో ఎఫైర్?

Show comments