మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో సాలిడ్ హిట్ అందుకోని మంచి జోష్ లోకి వచ్చాడు. ఈ సంక్రాంతి మ్యాజిక్ నే మరోసారి రిపీట్ చెయ్యడానికి రెడీ అయిన చిరు, మెహర్ రమేష్ తో కలిసి ‘భోలా శంకర్’ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్, చిరుకి చెల్లి పాత్రలో నటిస్తోంది. తమిళ్ లో అజిత్ నటించిన వేదాలం సినిమాకి రిమేక్ గా తెరకెక్కుతున్న భోలా శంకర్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి మెగా అభిమానుల్లో చిన్న భయం ఉండేది. మెహర్ రమేష్ ట్రాక్ రికార్డ్ బాగోలేదు, చిరుతో సినిమా అంటే ఏం చేస్తాడో అని కంగారు పడేవారు. మెహర్ రమేష్ నెమ్మదిగా భోలా శంకర్ సినిమాపై అంచనాలు పెంచే పనిలో ఉన్నాడు. ఫాన్స్ కి మెగా మాస్ చూపిస్తే సినిమా హిట్ అనే విషయం మెహర్ కి బాగా తెలుసు అందుకే భోలా శంకర్ సినిమాని పర్ఫెక్ట్ గా క్రాఫ్ట్ చేస్తున్నాడు. చూడాలని ఉంది సినిమాని గుర్తు చేస్తూ భోలా శంకర్ సినిమాలో కలకత్తా బ్యాక్ డ్రాప్ కి వెళ్ళిపోయారు. హైదరాబాద్ లో వేసిన కలకత్తా సెట్స్ లో భోలా శంకర్ షూటింగ్ చేశారు. ఈ సెట్స్ నుంచి బయటకి వచ్చిన చిరు ఫొటోస్ అండ్ అఫీషియల్ గా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ లో చిరు చాలా యంగ్ గా కనిపించాడు. స్టైలిష్ అండ్ ఫిట్ గా కనిపించిన చిరు, ఫాన్స్ లో ఫుల్ జోష్ నింపాడు. ఈ జోష్ ని మరింత పెంచుతూ మేకర్స్ మే డే రోజున భోలా శంకర్ సినిమా నుంచి పోస్టర్స్ బయటకి వచ్చాయి.
అందరికీ మే డే శుభాకాంక్షలు చెప్తూ బయటకి వచ్చిన ఈ పోస్టర్స్ లో చిరు క్యాబ్ డ్రైవర్ గా కనిపించాడు. టీ తాగుతూ మంచి స్వాగ్ తో కనిపించిన చిరు వింటేజ్ వైబ్స్ ఇచ్చాడు. చిరు గతంలో గ్యాంగ్ లీడర్, ఇంద్ర సినిమాల్లో క్యాబ్ డ్రైవర్ గా నటించాడు. ఈ రెండు సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా ఇంద్ర సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా చిరు క్యాబ్ డ్రైవర్ గానే కనిపిస్తాడు. ఈ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు భోలా శంకర్ పోస్టర్స్ చూస్తూనే ఫాన్స్ కి గ్యాంగ్ లీడర్, ఇంద్ర సినిమాలే గుర్తొస్తు ఉంటాయి. అందుకే వింటేజ్ వైబ్స్ అంటూ ఫాన్స్ ఈ పోస్టర్స్ ని వైరల్ చేస్తున్నారు. మొత్తానికి నెమ్మదిగా సినిమాపై అంచనాలు పెంచుతున్న మెహర్ రమేష్ అండ్ టీం, భోలా శంకర్ సినిమా ఆగష్టు 11నే ప్రేక్షకుల ముందుకి వస్తుంది అనే క్లారిటీ కూడా ఇచ్చేసారు. ఇదే రోజున డీజే టిల్లు స్క్వేర్, శివ కార్తికేయన్ మాహావీరుడు సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. చిరు వస్తున్నాడు కాబట్టి టిల్లు వెనక్కి వెళ్తాడేమో చూడాలి.
కార్మికులు,కర్షకులు, శ్రమ జీవులకు అందరికి మే డే శుభాకాంక్షలు❤️
Team #BholaaShankar honour & celebrate every worker on this #MayDay💥
Releasing in Theatres on AUG 11th🤟🏻
Mega🌟 @KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @adityamusic pic.twitter.com/nOtkv3AntS
— AK Entertainments (@AKentsOfficial) May 1, 2023
