NTV Telugu Site icon

Bholaa Shankar: పొరపాటున కూడా థియేటర్ విజిట్ కు రావద్దు మెహర్ అన్నా..

Mehar

Mehar

Bholaa Shankar: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. తమిళ్ హిట్ సినిమా వేదాళం కు రీమేక్ గా మెహర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే భారీ అంచనాల మధ్య నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందు నుంచి మెహర్ రమేష్ ను నమ్మడం మెగా ఫ్యాన్స్ కు కొద్దిగా కష్టంగానే అనిపించింది. ఎందుకంటే ఆయన సినిమాలు అలాంటివి మరి. అయినా ఇక్కడ ఉన్నది చిరు కాబట్టి.. గుండెను గట్టిగా పట్టుకొని థియేటర్ కు వెళ్లారు. కానీ, ఈసారి కూడా మెగా ఫ్యాన్స్ కు లక్ కలిసిరాలేదు. ఈ సినిమలో చిరును చూసినట్లు ఏ సినిమాలో చూడరు అని మెహర్ చెప్పినప్పుడే అర్ధం చేసుకోవాల్సింది అని అభిమానులు తలలు కొట్టుకుంటున్నారు.

Rajinikanth Net Worth: రజనీకాంత్ ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

మెగా ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ గా ఉంటుందని చెప్పడం.. అంతేకాకుండా ఇందులో పవన్ కళ్యాణ్ ను చిరు ఇమిటేట్ చేయడం, యాక్షన్ ఎలిమెంట్స్, కామెడీ టైమింగ్ ఇలా అన్ని ఉన్నా కూడా భోళా మాత్రం అభిమానులను మెప్పించలేకపోయింది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా టాక్ గురించి, ఫ్యాన్స్ రియాక్షన్స్ తెలుసుకోవడానికి మెహర్ రమేష్ థియేటర్ విజిట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో నెటిజన్లు మెహర్ ను వార్న్ చేస్తున్నారు. పొరపాటున కూడా థియేటర్ విజిట్ కు రావద్దు మెహర్ అన్నా.. జనం కొట్టినా కొడతారు అని కొందరు. నిన్ను నమ్మినాం చూడు మాది తప్పు మెహర్ అన్నా అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా రిజల్ట్ పై మెహర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.