Bhola Mania Lyrical Song Released From Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘భోళా శంకర్’ ఒకటి. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా.. తమిళంలో మంచి విజయం సాధించిన వేదాళంకు రీమేక్. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా భాటియా కథానాయికగా నటిస్తుండగా.. కీర్తి సురేశ్ సోదరి పాత్ర పోషిస్తోంది. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా ముస్తాబవుతున్న తరుణంలో.. చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆసక్తికరమైన అప్డేట్స్‌ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తోంది. ఇందులో భాగంగానే.. మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేశారు. ‘భోళా మేనియా’గా రిలీజైన ఈ పాటకు యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ సంగీతం సమకూర్చగా.. ఎల్వీ రేవంత్ గాత్రం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.
Medicine Banned: 14 రకాల మందుల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్లను నిషేధించిన ప్రభుత్వం
‘‘అదిరే స్టైల్ అయ్యా, పగిలే స్వాగ్ అయ్యా, యూఫోరియా నా ఏరియా, హే భోళా మేనియా’’ అంటూ సాగే ఈ పాట ఎంత వినసొంపుగా ఉందో.. చిరంజీవి ఎనర్జీ కూడా అందరిలోనూ అంతే జోష్ నింపుతుంది. ‘‘ఎక్స్‌ట్రాలొద్దయ్యా, కొలెస్ట్రాల్ వద్దయ్యా, ఎవ్వడైనా గూబ గుయ్యా’’ అనే లిరిక్స్.. ఇందులోని చిరు పాత్ర ఎంత బలంగా ఉంటుందోనన్న దానికి నిదర్శనం. 68 ఏళ్ల వయసులోనూ చిరు ఎంతో ఎనర్జిటిక్‌గా వేసిన ఆ డ్యాన్స్, ఆ స్వాగ్ చూస్తే.. ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అసలు ఆయనకు అంత వయసుందా? అని ఆశ్చర్యం కలగక మానదు. బ్యాక్‌గ్రౌండ్‌లో వేసిన సెట్ చూస్తూ.. ఈ పాటకు బాగానే ఖర్చు పెట్టి, గ్రాండ్‌గా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. చూస్తుంటే.. ఇది సినిమాలో చిరు ఇంట్రో సాంగ్ అని స్పష్టమవుతోంది. థియేటర్లలో ఈ పాట చూస్తున్నప్పుడు.. మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా థియేటర్లలో స్టెప్పులు వేయడం ఖాయం.
Ambati Rambabu: చంద్రబాబు ప్రవేశపెట్టింది మేనిఫెస్టో కాదు.. మోసఫెస్టో
